• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెట్టుబడుల కోసం తిప్పలు: పారిశ్రామికవేత్తల కోసం ఇన్వెస్టర్ల సమ్మిట్ లో బెల్లీ డాన్సులు!

|
  పారిశ్రామికవేత్తల కోసం ఇన్వెస్టర్ల సమ్మిట్ లో బెల్లీ డాన్సులు!

  ఇస్లామాబాద్: దారుణమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది మన పొరుగు దేశం పాకిస్తాన్. కుప్పకూలిపోయిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి పాట్లు పడుతోంది ఆ దేశ ప్రభుత్వం. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి గాడిదలను ఎగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలో పడింది. తాము వినియోగించే లగ్జరీ కార్లను సైతం అమ్మకానికి పెడుతున్నారు పాకిస్తానీయులు. పెట్టుబడులు వరదలా ప్రవహిస్తే తప్ప కోలుకోలేని స్థితిలో ఉంది పాకిస్తాన్. పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడింది. పాకిస్తాన్ లో పెట్టుబడులను పెట్టడానికి గల అవకాశాలను వివరించడానికి ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్ల సదస్సులో బెల్లీ డాన్సులను ఏర్పాటు చేసింది.

  ఈ పెట్టుబడిదారుల సదస్సులో బెల్లీ డాన్సర్లు రెచ్చి పోయారు. అర్ధనగ్న ప్రదర్శనతో పెట్టుబడిదారుల మతి పోగొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి అజర్ బైజాన్ లో ని బాకూ నగరంలో కొద్దిరోజుల కిందట ఓ భారీ పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సర్హద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని నిర్వహించింది. ఖైబర్ ఫక్తున్ ఖ్వా సహా సెంట్రల్ పాకిస్తాన్, సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టుబడులను పెట్టడానికి గల అవకాశాలను వివరించడానికి ఏర్పాటు చేసిన సమ్మిట్ అది. అలాంటి సదస్సులో బెల్లీ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.

  Pakistan hires belly dancers to perform at investment summit to woo investors

  రెండు రోజుల పాటు కొనసాగిన ఈ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సుమారు ఆరుమందికి పైగా బెల్లీ డాన్సర్లు తమ డాన్స్ తో అదర గొట్టారు. పలువురు పెట్టుబడిదారులు బెల్లీ డాన్స్ షో ను తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ కనిపించారు. ఈ ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ఎన్ని వేల కోట్ట రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయన్నది ఇంకా తేలాల్సి ఉన్నప్పటికీ.. బెల్లీ డాన్స్ వల్ల ఈ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందని చెబుతున్నారు సర్హద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు. పాకిస్తాన్ ప్రభుత్వమే ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం పట్ల సొంతదేశం నుంచే వ్యతిరేకత ఎదురవుతుండటం ఓ ట్విస్ట్. పలువురు నెటిజన్లు, ట్విట్టరెటీలు తమ దేశ ప్రభుత్వ అధికారుల తీరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు ఏ మాత్రం లేకపోవడం వల్లే అధికారులు బెల్లీ డాన్సర్ల మీద ఆధార పడ్డారని విమర్శిస్తున్నారు. చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించిన తరువాత కూడా పాకిస్తాన్ ఆర్థికంగా ఏ మాత్రం కోలుకోలేనంగా దెబ్బతిన్నదని అంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) సైతం పాకిస్తాన్ కు ఆరు బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ మొత్తాలన్నీ జీతాల చెల్లింపులకే సరిపోతోందని, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి అవసరమైన దూరదృష్టి లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విమర్శిస్తున్నారు. పాకిస్తానీ జర్నలిస్ట్ ఒకరు ఈ బెల్లీ డాన్స్ ను వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

  English summary
  To revive its crumbling economy, Pakistan's Sarhad Chamber of Commerce and Industry (SCCI) recently organised an investment summit in Azerbaijan, where some belly dancers performed to woo the investors. The Khyber Pakhtunkhwa Investment Opportunities Conference was organised between September 4 to 8 in Baku, Azerbaijan. The belly dancers stole the show by dancing on the stage in front of the attendees at the conference.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X