వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ బానిసలుగా..: వెలుగులోకి పాకిస్తాన్ మరో ఘాతుకం

పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ దౌద్ ఖట్టక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

కరాచీ: పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ దౌద్ ఖట్టక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వందలాది మంది పస్తూన్ యువతులను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు.

తీవ్రవాద క్యాంపుల ప్రాంతాల్లో ఫండింగ్ చేసేందుకు యువతులను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉమర్ దౌద్ ఖట్టక్.. ఆప్ఘనిస్తాన్‌కు చెందిన పస్తూన్ నాయకుడు. పస్తూన్‌ వేర్పాటువాద నాయకుడు.

 Umar Khattak

పాకిస్తాన్ సైన్యం స్వాత్, వజీరిస్తాన్ ప్రాంతాలలో ఎన్నో ఇళ్లను నాశనం చేస్తోందని, వందలాది మంది యువతులను కిడ్నాప్ చేసి.. లాహోర్‌లో సెక్స్ బానిసలుగా మారుస్తోందని ఆరోపించారు.

పాకిస్థాన్‌ తమ ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లు చేపట్టి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ముఖ్యంగా పస్తూన్‌ యువతులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని, వారిని అపహరించి అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు.

పాకిస్తాన్ చేతికి న్యూక్లియర్ సబ్‌మెరైన్: ఆయుధ పోటీపాకిస్తాన్ చేతికి న్యూక్లియర్ సబ్‌మెరైన్: ఆయుధ పోటీ

తమ ప్రాంతాల్లో ఇళ్లను కూల్చివేశారని, వారి అకృత్యాలకు భరించలేక ఇప్పటికే అయిదు లక్షల మంది అఫ్గాన్‌కు తరలిపోయారని తెలిపారు. ఈ ఆగడాలన్నింటినీ అడ్డుకునేందుకు త్వరలో పస్తూనిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీని నెలకొల్పనున్నామని, అందుకు ప్రపంచదేశాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

అంతముందు బెలూచిస్థాన్‌, గిల్గిట్‌ ప్రాంతాల్లో పాకిస్తాన్ అకృత్యాలను, ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పినందుకు కొందరు బెలూచిస్తాన్ నాయకులు మోడీకి అప్పట్లో కృతజ్ఞతలు తెలిపారు.

English summary
A Pashtun activist, in a startling revelation, today alleged that Nawaz Sharif-led Pakistan government is using Pashtun women as sex slaves to fund terror camps in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X