వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌పై పాకిస్థాన్ అక్కసు:యూఎన్ కౌన్సిల్‌లో లేవనెత్తే ఛాన్స్, షిరీన్ మజారీకి ధీటుగా వికాస్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌పై సమయం దొరికప్పుడల్లా తన అక్కసును వెళ్లగక్కే పాకిస్థాన్ మంగళవారం మరోసారి తన విషం చిమ్మనుంది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. పాకిస్థాన్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారీ భారత్‌పై విషం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇవాళ ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలిలో కూడా అదే వాణిని వినిపించబోతునున్నారు.

చివరి నిమిషంలో..

చివరి నిమిషంలో..

వాస్తవానికి యూఎన్ హ్యుమాన్ రైట్స్ కౌన్సిల్ సెషన్‌లో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి మఖ్దూమ్ షా మెహమూద్ ఖురేషి ప్రసంగించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో షిరీన్ మజారీని పాకిస్థాన్ పంపించింది. యూఎన్ సమావేశానికి షిరీన్‌కు పాక్ పంపించడం వెనక తప్పకుండా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతారనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కశ్మీర్‌లో మానవ హక్కులను భారతదేశం ఉల్లంఘిస్తోందని ఆమె ఆరోపించే అవకాశం ఉంది.

ఈయూపై కూడా..

ఈయూపై కూడా..

కశ్మీర్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్థాన్ మంత్రి షిరీన్ ఇదివరకు యూరొపియన్ యూనియన్‌పై కూడా నోరు పారేసుకున్నారు. కశ్మీర్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా భారతదేశం మానవ హక్కలను ఉల్లంఘిస్తోన్న ఈయూ కలుగజేసుకోవడం లేదని, తమపై వివక్ష చూపిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. మతపరమైన హింస పేరుతో పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు. సీఏఏలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్‌లో మతపరమైన హింస ఎదుర్కొన్న ముస్లింలు తప్ప మిగతావారికి పౌరసత్వం ఇస్తామని భారతదేశం చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని షిరీన్ తప్పుపట్టారు.

గట్టిగా కౌంటర్

గట్టిగా కౌంటర్

మంగళవారం యూఎన్‌లో షిరీన్ తన వాదనలు వినిపించనుండగా.. బుధవారం భారతదేశ ప్రతినిధి వికాస్ స్వరూప్ ప్రసంగిస్తారు. పాకిస్థాన్ చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానం చెబుతారు. యూఎన్‌లో తన మద్దతుదారులైన మలేషియా, టర్కీకి చెందిన 47 మంది సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అంతేకాదు చైనా కూడా అంటిముట్టనట్టుగానే ఉంటోంది.

Recommended Video

ఆర్టికల్ 35Aపై వివాదమేంటి..? | Oneindia Telugu
జై శంకర్ వాదన

జై శంకర్ వాదన

గతవారం బ్రస్సెల్స్‌లో పర్యటించిన భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈయూ మంత్రులతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం గురించి వివరించారు. దీంతో ఈయూపై షిరీన్ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా.. మద్దతు సాధించలేకపోయారు. దీంతో చైనా సపోర్ట్ తీసుకొని..కశ్మీర్ అంశంపై తన వాణిని బలంగా వినిపించాలని పాకిస్థాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
Pakistan human rights minister Shireen Mazari is expected to speak at the UN Human Rights Council session at Geneva on Tuesday, and accuse India of human rights abuses in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X