వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగివస్తున్న పాక్ ..కొత్త ప్రభుత్వంతో చర్చలకు సిద్దం అంటున్న పాక్ నేతలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో బీజేపీ భారీ మెజారీటి సాధించడంతో పాక్ దిగివచ్చింది. భారత్‌తో సానూకూల చర్చలకు సిద్దమని పాక్ విదేశాంగా మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత్‌‌తో ఉన్న సమస్యలపై చర్చించేందుకు కొత్త ప్రభుత్వంతో చర్చిందేకు సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

నయా సర్కార్‌తో చర్చలకు సిద్దం

నయా సర్కార్‌తో చర్చలకు సిద్దం

పాకిస్థాన్‌లోని ఇఫ్తార్ విందు తర్వాత ఖురేషీ అక్కడి మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ఇరుదేశాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం భారత ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి పదవిబాధ్యతలు చేపట్టబోతున్న సంధర్భంలో ఆయనకు అభినందనలు తెలిపారు. దీంతోపాటు నరేంద్రమోడీ శాంతి,సౌభ్రాతృత్వాలకు కృషి చేయాలని ఆయన కోరారు.

నరేంద్రమోడీ తిరిగి అధికారం చేపడితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

నరేంద్రమోడీ తిరిగి అధికారం చేపడితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

కాగా అంతకుముందు నరేంద్రమోడీ నాయకత్వంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ద్వారనే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని మరోవైపు కశ్మీర్ సమస్యకు పరిష్కారం కూడ లభిస్తుందని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం ఆశభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఎన్నికల ముందు సంచలన శ్యాఖ్యలు చేశారు. కాగా వాటీ ప్రభావం దేశ ఎన్నికలపై కూడ పడింది. సాధరణంగా కశ్మీర్ నాయకులు మోడీని వ్యతిరేకిస్తుంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మోడీని సపోర్ట్ చేయడంతో మోడీకి పాక్‌నుండి మద్దతు లభించినట్లయింది.

అంతర్జాతీయంగా శక్తివంతమైన భారత్

అంతర్జాతీయంగా శక్తివంతమైన భారత్

ఇక పాకిస్థాన్ మొదటి నుండి భావించినట్టుగానే భారతదేశంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆదేశం భారత్‌కు స్సేహ హస్తాన్ని అందిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా మోడీ పట్టు సాధించడం, పాకిస్థాన్ కు మద్దతు తెలుపుతున్న, చైనా సైతం దిగివచ్చేటట్లు చేసింది. దీంతో పాకిస్థాన్ భారత్‌తో చర్చలు మినహ ఇతర మార్గాల్లో పై చేయి సాధించే అవకాశం లేకపోవడంతో కశ్మీర్ సమస్యపై చర్చించేందుక సిద్దంగా ఉన్నామంటూ సానుకూల సంకేతాలు పంపుంతోంది.

English summary
pakistan is reday to hold talks with new indian government to resolve all outstanding issues, foreign minister shah mehmood qureshi said in state run radiao pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X