వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌: బలూచిస్తాన్‌లో 11 మంది కార్మికుల తలలు నరికివేసిన ఇస్లామిక్ స్టేట్ - News reel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన దాడిలో 11 మంది షియా హజారాలు మరణించారు. ఈ దాడిని చేపట్టింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

దాడిని తామే చేపట్టినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీకి ఇస్లామిక్ స్టేట్ ఒక లేఖ రాసినట్లు రాయిటర్స్ తెలిపింది.

బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు 100 కి.మీ. దూరంలో బోలాన్ జిల్లాలో ఈ దాడి జరిగింది.

బొగ్గు గనిలో పనిచేస్తున్న 11 మంది కార్మికులు దాడిలో మరణించారని అధికారులు తెలిపారు.

కార్మికుల కళ్లు, చేతులకు గుడ్డలు కట్టి తలలు నరికేశారని ఓ భద్రతా అధికారి రాయిటర్స్‌కు చెప్పారు.

మైనారిటీ షియా వర్గాలపై ఇక్కడ దాడులు జరగడం కొత్తేమీ కాదు. గత ఏప్రిల్‌లో షియాలు ఎక్కువగా ఉండే మార్కెట్‌లో దాడిచేసి 18 మందిని హతమార్చారు.

నైజర్

నైజర్ దాడిలో 100కు పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో రెండు గ్రామాలపై జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన వారి సంఖ్య వందకు పెరిగింది. ఇది ఇస్లామిస్ట్ మిలిటెంట్ల చర్యగా అనుమానిస్తున్నారు.

మృతుల సంఖ్య వందకు పెరిగినట్లు నైజర్ ప్రధాన మంత్రి బ్రిగి రఫీనీ సోమవారం తెలిపారు.

ఈ రెండు గ్రామాలు కూడా నైజర్‌కు పశ్చిమాన మాలీ సరిహద్దులకు దగ్గరగా ఉన్నాయి.

ఇటీవల కాలంలో ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులు అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయి.

కొన్నాళ్లుగా సహెల్ ప్రాంతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ నేతృత్వంలో వెస్ట్ ఆఫ్రికా, యూరోపియన్ కూటమి చర్యలు చేపడుతోంది.

అయినా కూడా ఆ ప్రాంతంలో మాదక ద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా, జాతి హింస జరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Islamic State beheads 11 workers in Balochistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X