వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం రిపోర్టింగ్‌రా నాయనా.. వరద నీటి లోతులో మునిగి తేలుతూ..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. ఇక లైవ్ రిపోర్టింగ్ పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోతోంది. డెత్ మిస్టరీలు చేధించాల్సిన పోలీసులు సైతం చేయలేని ప్రయత్నాలు ఇటీవల కాలంలో రిపోర్టర్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. అదలావుంటే గాడిదల సంతతి పెరిగిపోతోందంటూ ఆ మధ్య పాకిస్తాన్ రిపోర్టర్.. గాడిద మీద ఎక్కి రిపోర్టింగ్ చేసిన తీరు, అది అతన్ని కిందపడేసిన వైనం ఇంకా జనాలు మరిచిపోలేదు. అయితే తాజాగా వరద ప్రవాహంలో నిల్చుని చేసిన రిపోర్టింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!

లైవ్‌ రిపోర్టింగ్ పేరుతో పాకిస్థాన్ రిపోర్టర్లు వింతగా ప్రవర్తిస్తుంటారు. రియల్టీ కనిపించాలనుకుంటారో ఏమోగానీ ప్రాణాలకు రిస్క్ తీసుకుని రిపోర్టింగ్ చేస్తుంటారు. అది కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా అక్కడి పంజాబ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో వరద నీటిలో మునిగి తేలుతూ ఓ రిపోర్టర్ చేసిన లైవ్ రిపోర్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

pakistan journalist live reporting from flood water in river

అక్కడి వరద ప్రవాహంతో పాటు సింధు నది ఉదృతిని రిపోర్టింగ్ చేస్తున్న అజర్ హుస్సేన్ అనే జర్నలిస్ట్ వివరాలు తెలియజేస్తూ ఏకంగా నదిలోకి దిగాడు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది గ్రేట్ రిపోర్టింగ్ అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో అవసరమా అనవసరపు పైత్యం తప్ప అని కామెంటుతున్నారు. ఇలా వరద ప్రవాహంలోకి దిగి రిపోర్టింగ్ చేయాల్సిన సీన్ లేదంటూ ఇంకొందరు తలంటుతున్నారు.

English summary
Pakistan Reporter made live reporting from flood water which is in high level of flow in sindhu river. That video going viral in social media, netizens responding in different way. Some are accepting that live report and some others commenting like that is not good any cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X