వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగివచ్చిన పాక్.... గగనతలంపై నిషేధం ఎత్తివేత... సుమారు రూ.500 కోట్ల నష్టం...

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు అయిదు నెలల తర్వాత పాకిస్థాన్ తన గగనతలంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది..మంగళవారం అర్థరాత్రి నుండి అన్ని రకాల ఎయిర్ ట్రాఫిక్ సర్విసెస్‌ను పురరుద్దరిస్తున్నట్టు విమాయాన సంస్థలకు పాకిస్థాన్ సివిల్ ఏవియోషన్ అధికారులు నోటీసులను విడుదల చేశారు.కాగా మొత్తం 140 రోజుల పాటు పాక్ గగనతలంపై విమానల ప్రయాణాన్ని నిలిపివేసింది. దీంతో సుమారు రూ.500 కోట్లు విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం.

బాలాకోట్ దాడి తర్వాత పాక్ గగనతలం మూసివేత

బాలాకోట్ దాడి తర్వాత పాక్ గగనతలం మూసివేత

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి తర్వాత భారత్ ఫిబ్రవరి 26న ప్రతికారచర్యగా బాలాకోట్‌లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై సర్జికల్ స్త్ట్రైక్ నిర్వహించింది. ఇక అప్పటి నుండి పాకిస్థాన్ తన గగనతలంలోని పలు మార్గాలను మూసివేసింది. దీంతో రెండు సార్లు నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ కోరింది.కాని పాకిస్థాన్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో పలు విమానయాన సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోన్నాయి..

రెండు రోజుల క్రితమే నిరాకరించిన పాక్

రెండు రోజుల క్రితమే నిరాకరించిన పాక్

ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే ఇండియన్ ఎయిన్‌ఫోర్స్ తన ఎయిర్ బేస్‌లలో మోహరించిన జెట్ ఫైటర్స్‌ను వెనక్కి పంపించే వరకు విమానాల ప్రయాణాల కోసం పాకిస్థాన్ గగనతలాన్ని తెరబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది.అయితే తాజగా పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌లోని గురుద్వార్‌ను సందర్శించేందుకు భారత పర్యటకులు వీసారహిత సందర్శణకు పాకిస్థాన్ అనుమతినిచ్చింది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య అధికారిక సమావేశం జరిగింది. పలు అంశాలపై కూడ చర్చలు సానూకూలంగా జరగడంతో పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది.

ప్రధాని మోడికి ప్రత్యేకంగా అనుమతి

ప్రధాని మోడికి ప్రత్యేకంగా అనుమతి

కాగా ప్రధానమంత్రి మోడీ గత నెల షాంఘైలోని బిష్కేక్‌లో జరిగే ఎస్‌సీఓ సమావేశాలకు వెళ్లేందుకు పాక్ గగనతలం నుండి మోడీ ప్రత్యేక విమానాలు ప్రయాణించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే మోడీ మాత్రం పాక్ గగనతలాన్ని ఉపయోగించుకోకుండా ఇరాన్ మీదుగా షాంఘైలోని ఎస్‌సీవో సమావేశానికి హజరయ్యారు. పాక్ గగనతలం మూసి వేయడంతో మలేషియా, థాయ్‌లాండ్‌ నుండి నడిచే విమానాలు చాల దూరం ప్రయాణించి ఇండియాకు చేరుకోవాల్సి వస్తుంది.

English summary
moments after Pakistan lifted ban on its airspace imposed in the aftermath of Balakot airstrike on February 26, India has also lifted the ban on Pakistani airlines using India airspace. With the two orders, normal air traffic has been resumed over South Asia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X