వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఉగ్రదాడి సూత్రధారి సయీద్‌కు పాక్‌లో మరో షాక్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదదుల నాలుగో జాబితాలో అతని పేరు చేరుస్తూ పంజాబ్ ప్రావిన్స్ నిర్ణయం తీసుకుంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు షాక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) ఉగ్రవాదుల నాలుగో జాబితాలో అతని పేరును చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకు హఫీజ్ నిర్వహించే సంస్థలనూ జాబితాలో చేర్చినట్లు పాక్ మీడియా తెలిపింది.

నాలుగో జాబితా ప్రకారం.. ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచుతారని వెల్లడించింది. దానికితోడు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అడిగిన ప్రతీసారి కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కౌంటర్ టెర్రరిజం శాఖ(సీటీడీ) సయీద్ పేరును ఏటీఏ జాబితాలో చేర్చినట్లు తెలిపింది.

హఫీజ్‌తో పాటు మరో నలుగురు పేర్లను కూడా ఈ షెడ్యూల్‌లో చేర్చారు. హఫీజ్‌ను గత నెల 30న లాహోర్‌లో గృహ నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దేశం విడిచి పారిపోకుండా అతడి పేరును ఎగ్జిట్‌ కంట్రోల్‌ జాబితాలోనూ చేర్చారు.

Hafiz Sayeed

ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించే అవకాశముందని భావించిన పాక్ అధికార యంత్రాంగం హఫీజ్‌ సహా పలువురిని గృహ నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. వంద మృతికి కారణమైన ఇటీవలి దాడులు కూడా హఫీజ్‌పై చర్యలు తీసుకోవడానికి కారణమని అంటున్నారు.

English summary
Mumbai attack mastermind and JuD chief Hafiz Saeed has been listed under Pakistan's anti-terrorism act by the provincial Punjab government, a tacit acknowledgement of his links to militancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X