వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరువు తగ్గేందుకు వెళ్తే.. ఊపిరి తీసేశారు.. ఎక్కడో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

లాహోర్ : రోగంతోనే, ఇబ్బందితోనే ఆస్పత్రికి వెళ్తాం. అయితే అక్కడ బరువు తగ్గించుకునేందుకు వెళ్లాడు. ఆ వైద్యులు చూశారు. శరీరంలో కొవ్వు తీసేశారు. కొన్నిరోజుల పరీక్షల కోసం ఐసీయూలో ఉంచారు. అదే అతని పాలిట శాపమైపోయింది. కొద్దిరోజుల్లో ఇంటికెళ్తాననే ఆశలను అడియాసలు చేసింది. జీవితంపై ఆశలతో వచ్చిన ఆయనను జీవితమే లేకుండా చేశారు.

తిరిగిరానిలోకాలకు ..

తిరిగిరానిలోకాలకు ..

పక్క ఫోటోలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు నూరుల్ హసన్. పాకిస్థాన్‌లోని లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో గల సాదిక్‌బాద్ స్వస్థలం. నూరుల్ బరువు 330 కిలోలపైనే ఉంటారు. దీంతో అందరిలాగా తాను ఉండాలనుకున్నాడు. అలా అనుకోవడమే తన పాలిట శాపంగా మారింది. బరువు తగ్గించాలని లాహోర్ ఆస్పత్రిలో చేరారు. వారు కూడా ఇటీవల శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత ఐసీయూలోకి మార్చారు. అబ్జర్వ్ చేద్దామని ఉంచితే .. అతని ప్రాణాలు తీసేందుకు కారణమైంది. సన్నగా అయ్యేందుకు వెళ్లి .. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు హసన్.

ఆందోళనతో ..

ఆందోళనతో ..

హసన్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రిలో ఇవాళ ఓ మహిళ చనిపోయింది. దీంతో ఆమె తరఫు బంధువుల కోపం నశాళానికి ఎక్కింది. ఆస్పత్రిపై, వైద్యులపై దాడి చేశారు. కిటికీలు పగలగొట్టి, వెంటిలేటర్లు ఆఫ్ చేసి బీభత్సం సృష్టించారు. ఆస్పత్రిలో గందరగోళంతో ఎక్కడ సిబ్బంది అక్కడే దాచుకొన్నారు. దీంతో ఐసీయూలో రోగులు ఉన్నారు .. కానీ పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఐసీయూలో సిబ్బంది లేకపోవడంతో రోగుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. సరిగ్గా ఆ సమయంలోనూ హసన్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సిబ్బంది స్పందించలేదు. దాదాపు గంట తర్వాత సిబ్బంది వచ్చి చూశారు. అయితే హసన్ పరిస్థితి చూసి ... వెంటనే చికత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. హసన్ చనిపోయాడు. మరో రోగి కూడా మృతిచెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నాయి.

ఆర్మీ సాయం ..

ఆర్మీ సాయం ..

భారీ కాయం వల్ల హసన్‌ను ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం కూడా సమస్యగా మారడంతో ఆర్మీ సాయం కోరారు. హసన్ అభ్యర్థన మేరకు అతడిని ఆస్పత్రికి తరలించేందుకు పాక్ సైన్యాధిపతి బజ్వా ఏర్పాట్లు చేశారు. సైనికులను ఇంటికి కూడా పంపించి పంపించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహోర్ ఆస్పత్రికి తరలించి .. చికిత్స అందించారు. హసన్ కోసం పాకిస్థాన్ ఆర్మ ఇంతా చేస్తే .. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం అతని ప్రాణాన్ని తీసింది. ఐసీయూలో సమయానికి సిబ్బంది స్పందిస్తే ప్రాణం నిలిచేది. హసన్‌తోపాటు మరొకరు కూడా బ్రతికేవారు. కానీ వారి నిర్లక్ష్యం హసన్ ఊపిరిని తీసేసింది.

English summary
Sadiqabad, home to Pakistan, 400 km south of Lahore, Pakistan. Nurul weighs in at 330 kg. He wanted to be like everyone else.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X