వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ ప్రపంచ దేశాలను తప్పుదోవపట్టిస్తుంది.. యూఎన్ఎస్‌ఓ కౌన్సిల్ సమావేశం అనంతరం భారత్

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని పాకిస్థాన్ తప్పుదోవ పట్టించిందని, కశ్మీర్ అంశం పూర్తిగా భారత దేశానికి చెందిన అంతర్గత విషయమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఎన్ఎస్‌సి సమావేశం అనంతరం భారత దేశ శాశ్వత సభ్యుడైన సయ్యద్ అక్పరుద్దిన్ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌కు మద్దతు పలికిన చైనా వ్యాఖ్యలను చాల తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.

Pakistan misleading the world, Jammu and Kashmir was an internal matter;India

ఒప్పందాల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పిన భారత్

ఈ నేపథ్యంలోనే ఇండియా సిమ్లా ఒప్పందాలను పాటిస్తుందని కాని పాకిస్థాన్ కూడ ఆ ఒప్పందాలను పాటించాల్సి ఉంటుందని అక్భరుద్దిన్ చెప్పారు. పాకిస్థాన్‌లో చాలమంది దౌత్యవేత్తలతో భారత్‌కు సంబంధాలు ఉన్నాయని, కాని పాకిస్థాన్ మాత్రం తమ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. వాస్తవాలకు విరుద్దంగా పాకిస్థాన్ జిహాద్ పేరుతో భారత దేశంలో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు..ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో క్రమంగా భద్రత నిబంధనలు సడలిస్తున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో ఎప్పుడు చర్చలు జరుపుతున్నారన్న ప్రశ్నకు ఆయన మీతో నేను చేతులు కలుపతున్నానంటూ పాకిస్థాన్ జర్నలిస్టులవద్దకు వెళ్లి కరాచలనం చేశారు.

పాకిస్థాన్‌కు మద్దతు పలికిన చైనా...

కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలోనే పాకిస్థాన్ ఒంటరిగానే మిగిలింది...సమావేశంలో చైనా మినహా ఇతర సభ్యదేశాలు పెద్దగా స్పందించలేదని సమాచారం. ఆనేపథ్యంలోనే అగ్రరాజ్యల మద్దతు కూడ పాకిస్థాన్‌కు కరువయింది. ఇక ఈ సమావేశంలో చైనా పూర్తిగా పాకిస్థాన్‌కు మద్దతు పలికింది. ఈనేపథ్యంలోనే కశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైన పద్దతి కాదంటూ చైనా వాదించింది. దీంతో భారత ఉప ఖండంలో ఉద్రిక్తలు పెరగకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది.

ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పిన రష్యా,

ఇక రష్యా మాత్రం కశ్మీర్ అంశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశమని రష్యా అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు దేశాలు కూడ శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.. దీంతో పాటు భారత్, చైనా రెండు తమకు మిత్ర దేశాలే అని పేర్కోంది, ఇక తమకు ఎటువంటి రహస్య ఎజెండాలు లేవని చెప్పింది. సిమ్లా ఒప్పందంతో పాటు,లాహోర్ డిక్లరేషన్ ప్రకారం ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచిందింది. రెండు దేశాల మధ్య సామరస్య వాతవరణం కొనసాగే విధంగా తమవంతు సహయం చేస్తామని రష్యా తెలిపింది.

English summary
India on Friday defended its decision to scrap provisions of Article 370 that have special status to Jammu and Kashmir, saying that it was an internal matter. India also snubbed Pakistan for interfering in the internal matters of the country, saying that Pakistan was misleading the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X