వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ స్వర్గధామం: ఆక్స్‌ఫర్డ్ నివేదిక

|
Google Oneindia TeluguNews

ప్రంపంచ దేశాల్లో ఉగ్రవాదం ఒక్క పాకిస్తాన్‌లోనే ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు సర్గధామంగా మారిందని పేర్కొంది. అంతర్జాతీయ భద్రతకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రమాదంగా పరిణమించిందని నివేదిక తెలిపింది. సిరియాలో ఉన్న ఉగ్రవాదం కంటే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదం మూడురెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది.

ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశాల్లో పాకిస్తాన్‌దే తొలిస్థానం

ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశాల్లో పాకిస్తాన్‌దే తొలిస్థానం

"హ్యూమానిటీ ఎట్ రిస్క్- గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండికెంట్" పేరుతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ మరియు స్ట్రాటెజిక్ ఫోర్‌సైట్ గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పాక్ బండారం బయటపడింది. అంతేకాదు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని కూడా రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు సిరియాలో ఉంటే ప్రాణాపాయం ఎంతైతే ఉందో అంతకు మించి మూడురెట్లు ఎక్కువగానే ప్రాణాపాయం పాక్‌లో ఉందని నివేదిక వెల్లడించింది. అఫ్ఘాన్ తాలిబన్, లష్కరే తొయిబా సంస్థలు అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని వెల్లడించింది. ఉగ్రవాదుల స్థావరాలకు వారికి నివాసం కల్పిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచింది. అంతేకాదు పాకిస్తాన్ మద్దతుతో ఆఫ్ఘానిస్తాన్‌లో కూడా చాలా ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొంది.

 ఎప్పుడూ యాక్టివ్‌గా పనిచేసే 200 ఉగ్రవాద సంస్థలు

ఎప్పుడూ యాక్టివ్‌గా పనిచేసే 200 ఉగ్రవాద సంస్థలు

ఉగ్రవాదం, ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో 80 పేజీలతో కూడిన నివేదికను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అతివాదం, ఆయుధాలు వినియోగంతో ఆర్థకి వ్యవస్థను దెబ్బతీయడం తద్వారా అభివృద్ధిని అడ్డుకోవడం ఇప్పటి నుంచి 2030 వరకు కొనసాగుతుందని... వీటన్నిటికీ ఉగ్రవాద మూలాలు ఉంటాయిని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే ఒక 200 ఉగ్రవాద సంస్థలు వ్యవస్థను నాశనం చేసేందుకు ఎప్పుడూ పనిచేస్తున్నాయని స్ట్రాటెజిక్ ఫోర్‌సైట్ గ్రూపు పేర్కొంది.

గత ఐదేళ్లుగా మీడియాలో నానిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ

గత ఐదేళ్లుగా మీడియాలో నానిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ


ఎక్కువగా ఉగ్రవాదంను ఆకర్షిస్తున్నసంస్థల్లో ఐసిస్ ముందు వరసలో ఉంది. గత ఐదేళ్లుగా ఐసిస్ మీడియాలో నానుతోంది. అయితే ఐసిస్ కూడా ఆటుపోట్లను ఎదుర్కొంటుండగా ఆల్ ఖైదా మాత్రం యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. 2011 వరకు ఆల్‌ఖైదాను ఒసామా బిన్ లాడెన్ నడిపించగా ఆయన మృతి తర్వాత అతని కొడుకు హమ్జా బిన్ లాడెన్ నడిపిస్తున్నాడు. ఆల్‌ఖైదా పాకిస్తాన్‌లో పుట్టినప్పటికీ...పాక్ ఆక్రమిత ఆఫ్ఘానిస్తాన్‌లోకి మకాం మారింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌ ఒసామా బిన్ లాడెన్‌కు స్వర్గధామంగా నిలిచింది. అదికూడా పాకిస్తాన్ మిలటరీ ఏరియాకు కూతవేటు దూరంలో ఉంది. ఒక్క కాంపౌండే చాలా పెద్దదిగా ఉంటుంది. అదే కాంపౌండ్‌లో లాడెన్ కుటుంబం నివసించేది.

English summary
Pakistan remains to be a breeding ground of terrorism with the country registering the highest number of terrorist bases and safe havens, reveals a report. Identifying Lashkar-e-Taiba (LeT) as the outfit which continues to pose the maximum threat to international security, it said that Pakistan poses three times the terror risk to humanity than Syria.According to a news agency ANI, the facts were published in a report titled "Humanity at Risk - Global Terror Threat Indicant (GTTI)" by Oxford University and Strategic Foresight Group (SFG).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X