వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు కీడ్చాలి: 26/11పై భారత్ వచ్చేముందు పాక్‌కు ఒబామా వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 26/11 ముంబై తీవ్రవాదులను శిక్షించాల్సిందేనని, వారికి పాకిస్తాన్‌లో రక్షణ ఇవ్వడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టారు.

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను అమెరికా ఉపేక్షించే ప్రసక్తి లేదని, వాటిని మట్టుపెట్టాల్సిందేనని ఇండియా టుడే పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ముంబై మహా నగరం మీద ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల కేసులో నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకు రావాలన్నారు.

పాకిస్తాన్ దేశంతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నంత మాత్రాన పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను అమెరికా ఉపేక్షిస్తుందన్న భావన వద్దన్నారు. పరస్పర విశ్వాసం ప్రాతిపదికన భారత్, అమెరికా సంబంధాలు కొనసాగుతాయని, భవిష్యత్తులో వీటిని మరింత బలోపేతం చేస్తామన్నారు.

Pakistan must punish 26/11 perpetrators, India true partner: Barack Obama

అమెరికా జాగిలాలతో...

ఒబామా ఆదివారం నాడు భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన భద్రతలో పాలుపంచుకునేందుకు ఏడు జాగిలాలతో కూడిన ప్రత్యేకమైన అమెరికన్‌ డాగ్‌ స్క్వాడ్‌ గురువారం భారత్‌కు చేరుకుంది. ఒబామా బస చేసే పర్యటించే ప్రధాన ప్రాంతాలను ఈ డాగ్‌ స్క్వాడ్‌ జల్లెడపడ్తుంది.

ఈ బృందంలో ఉన్నవి ఆషామాషీ జాగిలాలు కాదు. కొంత కాలం క్రితం పాకిస్తాన్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీని కనుగొనడంలో యూఎస్‌ నేవీ సీల్స్‌కు సహకరించిన బెల్జియన్‌ మెలినోయిస్‌ జాతి కుక్కలు ఈ బృందంలో ఉన్నాయి.

పేలుడు పదార్థాలు ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టగల సత్తా వీటి సొంతం. భారత్‌లో ఒబామాకు 3 రోజులు విడిదిగా మారనున్న ఐటీసీ మౌర్య హోటల్‌ను ఈ డాగ్‌ స్క్వాడ్‌ జల్లెడపట్టనుంది. వీటికి ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసుకు చెందిన డాగ్‌ స్క్వాడ్‌ సహకరించనుంది. త్వరలో మరో జాగిలాల దండు భారత్‌కు వస్తుందని అమెరికన్‌ అధికారులు తెలిపారు.

English summary
US President Barack Obama has said "safe havens" of terrorism inside Pakistan were not acceptable and those behind Mumbai terror attacks must be brought to justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X