వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 ఏళ్ల తర్వాత జైలు నుంచి పాకిస్తానీ జలాలుద్దీన్ విడుదల, భగవద్గీత ఇంటికి తీసుకెళ్లాడు

|
Google Oneindia TeluguNews

వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి సెంట్రల్ జైలు నుంచి పదహారేళ్ల తర్వాత పాకిస్తాన్ జాతీయుడు జలాలుద్దీన్ విడుదలయ్యాడు. ఆదివారం జైలు నుంచి బయటకు వచ్చిన అతను తన వెంట హిందువుల గ్రంథం భగవద్గీతను కూడా వెంట తీసుకు వెళ్లాడు.

జలాలుద్దీన్ వారణాసీ కంటోన్మెంట్‌లో అనుమానాస్పదస్థితి డాక్యుమెంట్లతో పట్టుబట్టాడు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు విడుదలై ఇంటికి వెళ్తున్నాడు. నాడు అతని నుంచి కంటోన్మెంట్ మ్యాప్‌లు, ఇతర ముఖ్యమైన స్థలాలకు సంబంధించిన చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

అనుమానాస్పద డాక్యుమెంట్లతో అరెస్ట్

జలాలుద్దీన్ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వారణాసి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అంబరీష్ గౌడ్ చెప్పారు. 2001లో అతను కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో అరెస్టయ్యాడని చెప్పారు. అప్పుడు అతనిని పోలీసులు ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ సమీపంలో పట్టుకున్నారని చెప్పారు. అనుమానాస్పద డాక్యుమెంట్లు గుర్తించినట్లు చెప్పారు.

అతని వద్ద భగవద్గీత కాపీ

అతని వద్ద భగవద్గీత కాపీ

అఫీసియల్ సీక్రెట్స్ యాక్ట్ అండ్ ఫారెనర్ యాక్ట్ కింద అతనికి శిక్ష పడిందని చెప్పారు. అతనిని స్థానిక పోలీసులకు అప్పగించారని చెప్పారు. ఇప్పుడు విడుదల చేసినట్లు చెప్పారు. అతని వద్ద భగవద్గీత కాపీ కూడా ఉందని చెప్పారు.

జైల్లో ఎంఏ పూర్తి చేశాడు

జైల్లో ఎంఏ పూర్తి చేశాడు


అతను జైలుకు వచ్చిన సమయంలో హైస్కూల్ గ్రాడ్యుయేట్ అని పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత అతను ఇంటర్మీడియేట్ పూర్తి చేశాడని, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశాడని తెలిపారు. ఎలక్ట్రిషియన్ కోర్సు కూడా నేర్చుకున్నాడని చెప్పారు. గత మూడేళ్లుగా జైల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్‌లలో ఇతను అంపైర్‌గా ఉండేవాడని చెప్పారు.

సరిహద్దుల్లో అప్పగిస్తారు

సరిహద్దుల్లో అప్పగిస్తారు


జైలు నుంచి విడుదలైన జలాలూద్దీన్‌ను అధికారులు అమృత్‌సర్ తీసుకు వెళ్లారని చెప్పారు. వాఘా - అట్టారీ సరిహద్దుల్లో సంబంధిత అధికారులకు అతనిని అప్పగిస్తారని చెప్పారు. అతను తన వెంట భగవద్గీత తీసుకు వెళ్లాడని చెప్పారు.

English summary
Jalaluddin, a Pakistani national who was released after 16 years from Varanasi Central Jail on Sunday, took home Bhagavad Gita with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X