వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ అవే పిచ్చి కూతలు కూసిన ‘పాక్’ అబ్దుల్ బాసిత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.

భారత్‌తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందంటూనే పిచ్చి కూతలు కూశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాశ్మీరీల హక్కుల సాధనలో వారికి తమ దేశం నిత్య సహకారం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Pakistan not to abandon Kashmiris' legitimate struggle for freedom: Envoy Abdul Basit

ఇలాంటి స్వాతంత్రోద్యమాలు సంపూర్ణం కావడానికి కొన్నేళ్ళు లేదా తరాలు పడుతుందని పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. నేడు(ఆగస్టు 14) పాకిస్థాన్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బాసిత్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

గతంలో భారత్, పాక్ దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశానికి వేదిక, సమయం నిర్ణయం కాగానే.. కాశ్మీర్ వేర్పాటువాదులతో సమావేశమై కార్యదర్శుల సమావేశాన్ని కూడా బాసిత్ చెడగొట్టాడు. ఇప్పుడు కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశముందనగానే.. మళ్లీ ఈ విధమైన పిచ్చి ప్రేలాపనలు చేశారు.

English summary
Ahead of Indo-Pak NSA-level talks, Pakistan today said it will not "abandon" the Kashmiris' "legitimate struggle for freedom", stressing that to have normal and cooperative relationship with India it was necessary to settle the decades-old dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X