వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయనీయ స్థితిలో పాక్: ప్రధాని సచివాలయానికే కరెంట్ కట్!, ఇక యుద్ధమేం చేస్తుంది?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ ప్రగల్భాలు పలికే దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ వార్తను చూస్తే తెలుస్తోంది. కోట్లాది రూపాయలు బాకీ పడటంతో ఏకంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సచివాలయానికే విద్యుత్ నిలిపివేస్తామంటూ హెచ్చరించింది ఆ దేశ విద్యుత్ శాఖ.

రైళ్లలో జీపీఎస్! ఇక 700 రైళ్లకుపైగా రియల్ టైమ్ మానిటరింగ్రైళ్లలో జీపీఎస్! ఇక 700 రైళ్లకుపైగా రియల్ టైమ్ మానిటరింగ్

కోటి వరకు బకాయిలు..

కోటి వరకు బకాయిలు..

ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ(ఐఈఎస్‌సీఓ) బుధవారం ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం.. ఐఈఎస్‌సీఓకి ఆ దేశ ప్రధానమంత్రి సచివాలయం 41లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. గత నెల బకాయిలు 35లక్షలుగా ఉంది.

పలుమార్లు నోటీసులు ఇచ్చినా..

పలుమార్లు నోటీసులు ఇచ్చినా..

ఇప్పటికే పలుమార్లు ఐఈఎస్‌సీఓ నుంచి నోటీసులు అందుకున్నప్పటికీ సచివాలయం బాకీ పడిన మొత్తాలను చెల్లించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే విద్యుత్ నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

సచివాలయంలో ఎప్పుడూ తమకు వచ్చే సమస్యే ఇది అని వారు వాపోతున్నారు. ఇప్పటి వరకు బాకీపడిన మొత్తాన్ని చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయక తప్పదని ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ అధికారులు తేల్చి చెప్పారు.

కరెంటు బిల్లే కట్టలేదు కానీ.. యుద్ధం చేస్తుందా..?

కరెంటు బిల్లే కట్టలేదు కానీ.. యుద్ధం చేస్తుందా..?

కరెంటు బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్న పాకిస్థాన్.. భారత్‌తో యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలకడమెందుకని ఈ విషయం తెలిసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముందైతే కరెంటు బిల్లు కట్టండి.. ఆ తర్వాత యుద్ధం సంగతి చూసేరు.. అంటూ హితవు పలుకుతున్నారు.

English summary
The electricity supply to Pakistan Prime Minister Imran Khan's Secretariat faces disconnection over non-payment of bills running into crores of rupees. The Islamabad Electric Supply Company (IESCO) issued a notice to this effect on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X