వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ అంబాసిడర్ అవుతా...! కశ్మీరీల కోసం యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నాం:పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి యుద్ద ఘంటికలు మ్రోగించాడు. భారత దేశంపై యుద్దానికి వెళ్తాం సిద్దంగా ఉండండి అంటూ ఆదేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్ సిద్దంగా ఉందని ప్రకటించాడు. తాజాగా పీవోకో ప్రాంతంలో పాక్ ప్రధాని మాట్లాడారు. కాగా ఇదివరకే ఓసారి కశ్మీర్ పరిణామాలపై మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ భారత్ ‌తో యుద్దం తప్పదని హెచ్చరించారు.

కశ్మీర్‌లో ఆర్టికల్స్ తొలగింపుతోపాటు పునర్విభజపై పాకిస్థాన్ ప్రధాని మరోసారి తన కుట్రను బయటపెట్టాడు. భారత్‌తో యుద్దానికి సిద్దంగా ఉండాలని పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్‌ను తీవ్రంగా దుయ్యబట్టిన ఆయన మీడీయా కథనాలను ఊటంకిస్తూ కశ్మీర్‌లో ప్రస్తతం ఉన్న పరిణామాలు అక్కడి ముస్లింలను ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు.

pakistan PM Imran Khan threatened to go to war

కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలపై మానవత్వంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ తన చివరి ఖరీదైన ఆటను ఆడుతున్నాడని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ప్రాంతానికి తానోక అంబాసిడర్‌లా వ్యవహరిస్తానని పేర్కోన్నారు. ఇప్పటికే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లానని వివరించిన ఆయన భారత దేశంలో నివసిస్తున్న 18 కోట్ల ముస్లిం ప్రజలు భయాందోళనలో ఉంటున్నారని అన్నారు.

English summary
pakistan Prime Minister Imran Khan on Wednesday threatened to go to war following the Indian government's decision to scrap Article 370, which granted special status to Jammu and Kashmir. In his latest address in PoK, Khan said people of his country are ready to fight for the "freedom" of Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X