వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట-బలపరీక్షలో గెలుపు-విపక్షాల బాయ్‌కాట్‌

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లో తీవ్ర వ్యతిరేకత ఎధుర్కొంటున్న ఇమ్రాన్‌ ఖాన్ సర్కారు ఎట్టకేలకు పార్లమెంటులో విశ్వాస పరీక్ష నెగ్గింది. 342 మంది సభ్యుల పాకిస్తాన్ పార్లమెంటులో ప్రస్తుతం 341 మంది సభ్యులున్నారు. ఇవాళ జరిగిన బలపరీక్షలు విపక్షాలు బాయ్‌ కాట్‌ చేయడంతో ఇమ్రాన్‌ సర్కారు 178 ఓట్ల మద్దతుతో మూజువాణి విజయం సాధించింది.

పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీకి 157 మంది ఎంపీలున్నారు. విపక్షంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)కు 83 మంది, పీపుల్స్‌ పార్టీకి 55 మంది ఎంపీలున్నారు. ఆర్మీ మద్దతున్న ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై దేశంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకు ఇమ్రాన్‌ రాజీనామా చేయాలని విపక్షాలు పదేపదే డిమాండ్లు చేస్తున్నాయి. దీంతో ఆయన ఇవాళ బలపరీక్షకు సిద్ధమయ్యారు.

Pakistan PM Imran Khan Wins Vote of Confidence As Opposition Boycotts Session

విదేశాంగమంత్రి షా మహమూద్‌ ఖురేషీ ఇమ్రాన్ సర్కారుకు మద్దతుగా పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీన్నినిరసిస్తూ విపక్షాలు బాయ్‌ కాట్ చేశాయి. దీంతో ప్రభుత్వం మూజువాణీ ఓటుతో విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఆర్మీ మద్దతు కలిగిన ఇమ్రాన్‌ ఖాన్‌ ఎలాగైనా గెలిచి తీరతారని భావించిన విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే బలపరీక్షలో విజయంతో విపక్షాలపై ఇమ్రాన్‌ ఖాన్‌ నైతిక విజయం సాధించినట్లయింది.

English summary
Pakistan Prime Minister Imran Khan on Saturday won the trust vote tabled in Parliament, keeping his government safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X