వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై పట్టున్న జావెద్ బజ్వా పాక్ ఆర్మీ కొత్త చీఫ్

పాకిస్తాన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా నియమితులయ్యారు. చీఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం నాడు ఆదేశాలు ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా నియమితులయ్యారు. చీఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం నాడు ఆదేశాలు ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో వ్యవహారాలను చక్కబెట్టడంలో ఇతనికి మంచి అనుభవం ఉంది.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు ఉత్తర ప్రాంతాల వ్యవహారాలపై మంచి పట్టున్న వాడు ఖమర్‌ జావెద్‌ బజ్వా. ఇతను బెలూచ్ రెజిమెంట్‌కు చెందిన వాడు. ఉత్తరాది ప్రాంతంలో అతను చీఫ్ ఆఫ్ ఫోర్స్ కమాండర్‌గా పని చేశారు. జనరల్‌ రహీల్‌ నుంచి బజ్వా మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారు.

qamar javed bajwa

ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రహీల్‌ తాను పదవీ పొడిగింపును కోరుకోవడం లేదని నిర్ణీత తేదీకే విరమణ పొందుతున్నానని గతంలోనే ప్రకటించారు. పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన ఈ పదవికి ఆయననే కొనసాగిస్తారన్న ఊహాగానాలూ ఇటీవల వినిపించాయి. వాటికి తెర దించుతూ కొత్త సైన్యాధిపతిని నియమించారు.

మరోవైపు, సిబ్బంది కమిటీ అధిపతి (సీజేసీఎస్‌సీ)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ జుబైర్‌ హయత్‌ను నియమితులైనట్లు పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ తెలిపారు. అయిదోసారి సైన్యాధిపతి నియామకం జరిపిన పాక్‌ ప్రధానిగా షరీఫ్‌ ఘనతను సాధించారు.

English summary
Lt Gen Qamar Javed Bajwa has been appointed as the next army chief of Pakistan. He will take over from General Raheel Sharif who retires on November 29. In the list of probables his list figured last. Analysts had said that his name could be the surprise pick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X