వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌సీవోలో ఇమ్రాన్ ఖాన్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు.. వీడీయో

|
Google Oneindia TeluguNews

ఎస్‌సీఓ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్ నుండి రాజకీయా నాయకుడిగా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్‌కు ప్రపంచ దేశాల సమావేశాల్లో ఎలా ఉండలో తెలియదంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.బిష్కేక్ సమావేశాల్లో ఇతర దేశాల అధ్యక్షుల ముందు కనీస ప్రోటోకాల్ లేకుండా వ్యవహరించాడని వాపోతున్నారు.

ఎనిమిది దేశాల అధ్యక్షులు ఏస్‌సీవో సమావేశాలకు హజరు

ఎనిమిది దేశాల అధ్యక్షులు ఏస్‌సీవో సమావేశాలకు హజరు


కిర్గిస్థాన్‌లోని బిష్కేక్‌లో ఎస్‌సీవోలో రెండు రోజుల పాటు జరగనున్న ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అతిథ్య దేశం కిర్గిస్థాన్‌తోపాటు మొత్తం ఎనిమిది దేశాల అధ్యక్షులు ప్రారంభ సమావేశాలకు హజరయ్యారు.

ఎస్‌సీవో సమావేశంలో ప్రోటోకాల్ పాటించని పాక్ ప్రధాని

ఎస్‌సీవో సమావేశంలో ప్రోటోకాల్ పాటించని పాక్ ప్రధాని

అయితే ప్రారంభ సమావేశాల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ వింతగా వ్యవహరించాడు. సమావేశాల ప్రారంభంలో భాగంగా ఒక్కో దేశా అధ్యక్షులను సమావేశం హలులోకి అతిధ్యదేశం ఆహ్వానించింది. ఈనేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లను ముందుగా ఆహ్వానించారు. ఇక వీళ్లంతా మిగతా దేశాల అధ్యక్షులకు స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ ప్రకారం ఆయా దేశాల అధ్యక్షులకు కేటాయించిన స్థానాల్లో నిలబడి స్వాగతం పలికారు.ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన నేరుగా సమావేశం మందిరంలోకి వచ్చి ఆయనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు...

సమావేశంలో రెండు సార్లు లేచి మళ్లి కూర్చున్న ఇమ్రాన్ ఖాన్...

అయితే ఇమ్రాన్ ఖాన్ కొద్దిసేపటి తర్వాత మిగతా దేశాల అధ్యక్షులు నిలబడి స్వాగతం పలుకుతున్న విషయాన్ని గమనించి ఇమ్రాన్ ఖాన్ సైతం నిల్చున్నాడు. అయితే మళ్లి ఏమయిందో కొద్ది సేపటికే మళ్లి కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు.అయితే ఇమ్రాన్ వ్యవహార శైలిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సమావేశం వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.ఆ ప్రపంచ దేశాలతో సమావేశాలు జరిగేటప్పుడు కనీస అవగహాన లేకుండా ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించాడని , ఇలాంటీ సమావేశాలకు వెళ్లేటప్పుడు ప్రోటోకాల్ అంశాలు తెలుసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు కామేంట్స్ పెట్టారు.

English summary
Pakistan Prime Minister Imran Khan seems to have broken the diplomatic protocol at the opening ceremony of the SCO Summit in Bishkek when he sat down even as all other leaders were standing, an embarrassing gaffe for which he was heavily trolled online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X