వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా సహా బ్రిక్స్‌పై పాకిస్తాన్ భగ్గు, 'ఎవరికీ తలవంచమని నిరూపించిన మోడీ'

చైనా వేదిక‌గా జ‌రిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల స‌ద‌స్సులో ఆ ఐదు దేశాలు ఉగ్ర‌వాదంపై చర్చించాయి.

|
Google Oneindia TeluguNews

లాహోర్: చైనా వేదిక‌గా జ‌రిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల స‌ద‌స్సులో ఆ ఐదు దేశాలు ఉగ్ర‌వాదంపై చర్చించాయి.

చదవండి: అణు యుద్ధం.. అది ఉత్తరకొరియా సత్తా, మాకంటే బెస్ట్, పరిజ్ఞానం ఇవ్వలేదు: పాక్ శాస్త్రవేత్త

ఆసియాలో తీవ్ర స‌మ‌స్య‌గా మారిన తాలిబాన్, ఐసిస్, అల్ ఖైదా, హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలను అణ‌చివేయాల‌ని బ్రిక్స్ సదస్సులో సోమవారం ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

బ్రిక్స్‌పై పాకిస్తాన్ భగ్గు

బ్రిక్స్‌పై పాకిస్తాన్ భగ్గు

మోడీ పిలుపుకు మిగ‌తా నాలుగు దేశాల అగ్ర‌నేత‌లు సానుకూలంగా స్పందించారు. ఇది పాకిస్థాన్‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాల‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న ఈ ఐదు దేశాల‌పై పాకిస్థాన్ భ‌గ్గుమంది.

బ్రిక్స్ తప్పుడు ఆరోపణలు

బ్రిక్స్ తప్పుడు ఆరోపణలు

త‌మ దేశంపై బ్రిక్స్ దేశాల అగ్ర‌నేత‌లు తప్పుడు ఆరోపణలు చేశార‌ని పాకిస్థాన్ పేర్కొంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ మాట్లాడారు. త‌మదేశం ఉగ్రవాదుల‌ను అణచివేస్తోంద‌ని, ఉగ్ర‌ సంస్థ‌ల‌పై ప్రత్యేక నిఘా ఉందన్నారు. త‌మ‌ దేశం ఉగ్ర‌వాదుల‌కు స్వర్గధామం కాదన్నారు.

మోడీ ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచారు

మోడీ ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచారు

ప్ర‌పంచ దేశాల్లో భారత స్థాయిని న‌రేంద్ర‌ మోడీ ప్రభుత్వం మ‌రింత పెంచింద‌ని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. క‌ర్ణాట‌క‌లోని మాందలోని ఓ కాలేజీలో దివంగత ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి స్మారక కార్యక్రమంలో పాల్గొన్న‌ారు.

ఎవరికీ తలవంచమని మోడీ...

ఎవరికీ తలవంచమని మోడీ...

ఈ సందర్భంగా మాట్లాడారు. దేశ భద్రత, రక్షణ విషయాల్లో భార‌త్‌ ఎవరికీ తలవంచదని, ఈ విష‌యాన్ని మోడీ ప్రభుత్వం మ‌రోసారి (డోక్లాం విష‌యంలో) చాటి చెప్పింద‌ని భాగవత్ చెప్పారు. అలాగే దేశంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్య‌క్ర‌మం గొప్ప నిర్ణ‌య‌మ‌న్నారు. మోడీ ప్రభుత్వం చేప‌డుతున్న‌ కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో భారత్‌ స్థాయిని పెంచాయన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోంద‌న్నారు.

English summary
Under mounting international pressure to act against the terror groups, Pakistan today rejected a declaration by the BRICS nations, including China, saying there was no "safe haven" for terrorists on its soil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X