వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేం పద్ధతి: ఐక్యరాజ్య సమితి బృందానికి పాక్ వీసా తిరస్కరణ..ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

అమెరికా: 26/11 ముంబై మారణహోమం ప్రధానసూత్రధారి హఫీజ్ సయీద్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యుల బృందానికి వీసా నిరాకరించింది పాకిస్తాన్. వీసా కోసం అమెరికాలోని న్యూయార్క్ కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకోగా వారి దరఖాస్తులను నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ ఉగ్రవాదులు పేర్లు ఓ జాబితాలో చేర్చడం జరిగింది. వారిపై దాదాపు 1267 ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంక్షలు తనపై ఎత్తివేయాలంటూ హఫీజ్ సయీద్ యూన్‌కు ప్రతిపాదన పెట్టుకున్నాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలన్న యూఎన్ బృందానికి పాక్ వీసా నిరాకరించడం చర్చనీయాంశమైంది.

Pakistan rejects visa requests of UN team to interview Hafiz Saeed

ఇక ఒకరి పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన తర్వాత వారిపేర్లను తొలగించాలంటే ముందుగా ఐక్యరాజ్యసమితి ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తుంది. ఇందులో భాగంగానే హఫీజ్ సయీద్ పెట్టుకున్న ప్రతిపాదనపై ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు పాక్‌ వెళ్లాలని ఐక్యరాజ్యసమితి బృందం భావించి న్యూయార్క్‌లోని పాక్ కాన్సులేట్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోగా పాక్ తిరస్కరించింది. ఇక వీరి వీసాలు తిరస్కరణకు గురవడంతో ఐక్యరాజ్యసమితి అంబడ్స్‌మన్ కిప్ఫర్ ఫాసియాటి హఫీజ్ సయీద్‌‌తో వీడియో ఇంటర్వ్యూకు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆ దేశంలో కాంగ్రెస్‌కు మంచి టీఆర్పీలు: జైట్లీఆ దేశంలో కాంగ్రెస్‌కు మంచి టీఆర్పీలు: జైట్లీ

పుల్వామా దాడుల తర్వాత పాకిస్తాన్‌కు చెందిన జైషేమహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజహర్, సయ్యద్ సలాహుద్దీన్‌లను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలని భద్రతామండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. అయితే చైనా మాత్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ దేశాలు మసూద్ అజర్‌పై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించాయి.

English summary
Visa requests of a United Nations team to interview 26/11 Mumbai terror attack mastermind Hafiz Saeed, residing in Pakistan, were rejected by the country’s consulate in New York. A fresh proposal had been moved by Hafiz Saeed to remove his name from the UNSC 1267 sanctions list which is a list of UN recognised terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X