• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!

|

ప్రపంచమంతా కరోనావైరస్‌పై పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తన ఉగ్ర కార్యకలాపాల్లో మునిగితేలుతోంది. తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఉగ్రవాద బాధితులం అంటూ దొంగేడుపులు ఏడ్చే పాకిస్థాన్.. మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.

1800 ఉగ్రవాదుల పేర్లు తొలగింపు..

1800 ఉగ్రవాదుల పేర్లు తొలగింపు..

కరోనా పోరును గాలికొదిలేసిన పాకిస్థాన్.. నిషేధిత ఉగ్రవాదుల జాబితాను సవరించడం గమనార్హం. గుట్టుచప్పుడు కాకుండా 1800 మంది నిషేధిత ఉగ్రవాదుల్ని జాబితా నుంచి తొలగించింది. అందులో 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ సంస్థ బయటపెట్టింది.

బయటపెట్టిన అమెరికా సంస్థ..

బయటపెట్టిన అమెరికా సంస్థ..

న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాస్టెల్లమ్.ఏఐ అనే టెక్నాలజీ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018లో నిషేధిత జాబితాలో 7600గా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య.. ఇప్పుడు 3800కి చేరడం చేరింది. గత మార్చి నుంచి ఏకంగా 1800 మంది ఉగ్రవాదులను ఈ జాబితా నుంచి తొలగించినట్లు క్యాస్టెల్లమ్ వెల్లడించింది.

గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకే..

గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకే..

పాకిస్థాన్‌ను ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) గ్రే జాబితాలో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై జూన్ లో మరోసారి సమీక్ష జరపనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పించుకునేందుకు పాక్ తాజాగా ఈచర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏఫ్టీఎఫ్ సిఫార్సుల్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని నమ్మబలికించడానికి ఇందుకు సిద్ధమైంది పాకిస్థాన్.

  ICC Test Rankings : Virat Kohli Retains The Top Spot, Babar Azam Achieves Career Best Position
  ప్రపంచానికి తెలియకుండానే..

  ప్రపంచానికి తెలియకుండానే..

  అయితే, నిషేధిత ఉగ్రవాదుల్ని తొలగించినప్పుడు ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న నిబంధనలు ఉండగా.. వాటిని పాకిస్థాన్ లెక్కచేయకపోవడం గమనార్హం. ఈ మేరకు ప్రముఖ అమెరికా దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం ప్రచురితమైంది. ఉగ్రవాదులను తొలగించిన తీరు, వేగం పలు అనుమానాలకు తావిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి నిర్దేశించిన లక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న సూచనలు కూడా విస్మరించింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ మరోసారి పాకిస్థాన్ ను గ్రే జాబితాలోనే కొనసాగిస్తుందా? లేదా? అనేది చర్చకు దారితీసింది. ఓవైపు కరోనా వ్యాపిస్తుంటే.. దేశంలో రంజాన్ వేడుకలు జరుపుకోవచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీచేయడం గమనార్హం. పాకిస్థాన్ లో ఇప్పటి వరకు 9214 కరోనా కేసులు నమోదవగా, 192 మంది చనిపోయారు.

  English summary
  Pakistan removes 1,800 from terrorist watchlist without explanation: Report.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more