వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ దెబ్బకు పాక్ మంత్రి ప్యాంట్ జారింది!!: మోడీకి ఎలా కౌంటరివ్వాలో చెప్తా: ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తాము న్యూక్లియర్ దాడికి కూడా సిద్ధమని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సర్జికల్ స్ట్రయిక్ ద్వారా భారత్.. పాక్‌కు గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇండియన్ ఆర్మీ పీవోకేలో మెరుపు దాడులు నిర్వహించి 38 మంది ముష్కరులను హతమార్చారని తెలియగానే.. పాక్ రక్షణ మంత్రి ప్యాంటు ఊడిపోయిందని పేర్కొంటో ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది నెట్లో బాగా చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇది పాత వీడియో.

ఓ సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తున్న సదరు మంత్రి ప్యాంటు ఊడింది. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. ఒంటిమీద ప్యాంటు కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామని భారత్‌ను బెదిరించడం విడ్డూరమని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పాక్ మీడియాలో కూడా ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

Indian Army

భారత్‌కు ఆ హక్కు ఉంది: బంగ్లాదేశ్‌

తన భూభాగంపై దాడులు చేసిన వారికి బుద్ధి చెప్పే హక్కు భారత్‌కు ఉందని బంగ్లాదేశ్‌ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్‌ లక్షిత దాడులు చేయడంపై బంగ్లాదేశ్‌ స్పందించింది. భారత్‌ చర్య చట్టపరంగా, అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమని బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా సలహాదారు ఇక్బాల్‌ చౌదరి అన్నారు.

దేశ సార్వభౌత్వంపై, తన భూభాగంలో దాడుల పట్ల గట్టిగా స్పందించడం ఆ దేశాల హక్కుగా బంగ్లాదేశ్‌ నమ్ముతోందన్నారు. ప్రతి దేశం ఇతర దేశం సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించారు. అలాగే కాశ్మీర్‌ అంశంపై మాట్లాడుతూ.. ఇది ద్వైపాక్షిక వివాదమని, ఆవలి వైపు నుంచి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఉగ్రవాద చర్యలను బంగ్లాదేశ్‌ సహించబోదన్నారు.

మోడీకి ఏ విధంగా జవాబివ్వాలో షరీఫ్‌కు చెప్తా: ఇమ్రాన్ ఖాన్

పీవోకేలోకి వచ్చి సర్జికల్ స్ట్రయిట్ నిర్వహించిన భారత్ పైన పాక్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ ప్రధాని మోడీకి ఎలా కౌంటర్ ఇవ్వాలో తమ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెబుతానన్నారు. రేపు (శుక్రవారం) లాహోర్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.

English summary
Pakistan's Defence Minister Khawaja Asif, who had threatened to unleash nukes against India in the event of a retaliation over recent terror attacks in Uri, could not control his pants, quite literally!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X