వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది వరకు తీవ్రవాదులు హతమైనట్లుగా భావిస్తున్నారు. భారత్ ఉగ్రవాదులను మట్టుబెడితే పాక్ మాత్రం భారత్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోగా, మన ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.

రూ.3.57 కోట్ల నుంచి రూ.47 లక్షలకు పడిపోయింది: మూడేళ్లలో భారీగా తగ్గిన ఇమ్రాన్ ఖాన్ ఆదాయంరూ.3.57 కోట్ల నుంచి రూ.47 లక్షలకు పడిపోయింది: మూడేళ్లలో భారీగా తగ్గిన ఇమ్రాన్ ఖాన్ ఆదాయం

సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ నావికాదళం ఖాళీ, ఎందుకంటే

సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ నావికాదళం ఖాళీ, ఎందుకంటే

అయితే బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి అనంతరం పాక్‌లోని నావికాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయట. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ప్రింట్ తమ కథనంలో వెల్లడించింది. భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాక్ నావికాదళం నౌకాశ్రయాలను వీడి సముద్రంలోకి వెళ్లినట్లుగా ఇంటెలిజన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పాక్ నావికాదళం సముద్రంలోకి వెళ్లడానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు. 1971 భారత్ - పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇండియన్ నావికాదళం ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో కరాచీ రేవును ధ్వంసం చేసింది. దీని నుంచి కోలుకోవడానికి పాక్‌కు చాలా సంవత్సరాలు పట్టింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత యుద్ద వాతావరణం నెలకొనడంతో పాక్ ముందు జాగ్రత్త పడింది.

పాక్ నావికాదళం

పాక్ నావికాదళం

పాక్ నావికాదళంలోని నౌకలు ముఖ్యంగా కరాచీ, గ్వాదర్ తదితర నౌకాశ్రయాల్లో ఉంటాయి. ఫిబ్రవరి 26వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది. 28వ తేదీ వరకు కరాచీ తదితర ప్రాంతాల్లో నౌకలు ఉన్నాయట. ఫ్రిగేట్లు, సబ్ మెరైన్లు, గస్తీ తదితర నౌకలు అక్కడే ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అఖ్కడ కనిపించాయట. కానీ ఆ తర్వాత కనిపించలేదట. అన్ని నౌకాశ్రయాల్లోని నౌకలు ఒక్కసారిగా మాయం అయ్యాయట. ఇందుకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలను కూడా ఇచ్చారు.

నౌకలు మాయంభారత్ సర్జికల్ స్టైక్స్ చేసిన రెండు రోజుల్లో కరాచీ, గ్వాదర్ నౌకాశ్రయాల్లోని నౌకలు మాయమయ్యాయట. సముద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఓ నౌక మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించి ది ప్రింట్ ఫోటోలను కూడా ఇచ్చింది.

నౌకలు మాయంభారత్ సర్జికల్ స్టైక్స్ చేసిన రెండు రోజుల్లో కరాచీ, గ్వాదర్ నౌకాశ్రయాల్లోని నౌకలు మాయమయ్యాయట. సముద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఓ నౌక మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించి ది ప్రింట్ ఫోటోలను కూడా ఇచ్చింది.

భారత్ సర్జికల్ స్టైక్స్ చేసిన రెండు రోజుల్లో కరాచీ, గ్వాదర్ నౌకాశ్రయాల్లోని నౌకలు మాయమయ్యాయట. సముద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఓ నౌక మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించి ది ప్రింట్ ఫోటోలను కూడా ఇచ్చింది.

English summary
Pakistan’s entire naval fleet, including its submarines, has been out at sea since 28 February following heightened tensions with India, exclusive satellite images accessed by ThePrint show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X