వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: చనిపోయిన వ్యక్తి అకౌంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన విచారణ సంస్థ ఫెడరల్ దర్యాఫ్తు రూ.460 కోట్లను గుర్తించింది. అతను నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు. అతని పేరు మీద మూడు బ్యాంక్ అకౌంట్లు, అందులో డబ్బు ఉంది.

కరాచీకి చెందిన ఇక్బాల్ అరయాన్ అనే వ్యక్తి 2014లో చనిపోయాడు. అతను మృతి చెందినా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.460 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణ సంస్థ గుర్తించింది. కొందరు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు కేసులు రావడంతో సుప్రీం కోర్టు జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌(జేఐటీ)ని నియమించింది.

Pakistans FIA Discovers Rs 460 Crore Transactions in Dead Mans Accounts

ఇందులో భాగంగా ఈ ఖాతాలు, అందులోని డబ్బు తేలింది. ఇది చూసి విచారణ అధికారులు విస్తుపోయారు. పేద ప్రజల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి కొందరు బ్యాంకు అధికారులు భారీ మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించారు.

ఇటీవల కరాచీలోని ఓ చిరు వ్యాపారి బ్యాంకు ఖాతాలో ఆయనకు తెలియకుండా రూ.200 కోట్ల వచ్చి పడ్డాయి. ఓ ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. అధికారుల విచారణలో వారి డబ్బులు కాదని తేలింది.

English summary
A whopping Rs 460 crore worth of transactions were made through three bank accounts of a man who died months before these fake accounts were mysteriously opened under his name, a media report said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X