వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా పాజిటివ్, లక్ష కేసులతో సినిమా కష్టాలు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి ప్రపంచంలోని అన్ని వర్గాల వారిని భయపెడుతోంది. రాజు మంత్రి, పేదలు, శ్రీమంతులు అనే తేడా లేకుండా అందరికీ కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తోంది. ఓ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుత రైల్వే శాఖా మంత్రికి ఇప్పుడు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆ దేశంలోని రాజకీయ నాయకులు షాక్ కు గురైనారు. సామాన్య ప్రజలతో పాటు నేను ఎవ్వరినీ వదిలిపెట్టను అంటూ కరోనా వైరస్ అందరికీ చాలెంజ్ చేస్తోంది. మాజీ ప్రధాని, రైల్వే శాఖా మంత్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆదేశ ప్రభుత్వం వెల్లడించింది.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

 దాయాది దేశం మాజీ ప్రధాని

దాయాది దేశం మాజీ ప్రధాని

భారత్ దాయాది దేశం పాకిస్థాన్ లో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసి (61) అనారోగ్యానికి గురి కావడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయనకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

 అవును..... నిజమే... కరోనా వచ్చింది

అవును..... నిజమే... కరోనా వచ్చింది

పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసికి కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్థాన్ ముస్లీం లీగ్ నవాజ్ (PML-N) పార్టీ అధికార ప్రతినిధి మార్యమ్ ఔరంగజేబు నిర్దారించారని. PML-N పార్టీ నాయకుడిగా 2017 ఆగస్టు నుంచి 2018 వరకు పాక్ ప్రధానిగా పని చేసిన షాహిద్ ఖకాన్ అబ్బాసి కొంచెం మంచిపేరు తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

 అవినీతి కేసులతో లక్కీచాన్స్

అవినీతి కేసులతో లక్కీచాన్స్

పాక్ ప్రధాన మంత్రిగా నవాజ్ షరీఫ్ ఉన్న సమయంలో ఆయన పీకల్లోతుల్లో అనేక స్కామ్ ల్లో చిక్కుకుపోయారు. ఆ సమయంలో షాహిద్ ఖకాన్ అబ్బాసికి పాక్ ప్రధాన మంత్రిగా లక్కీచాన్స్ చిక్కింది. పేరుకు ప్రధానిగా షాహిద్ ఖకాన్ అబ్బాసి ఉన్నా పెత్తనం మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేతిలోనే ఉండేది.

 రూలింగ్ పార్టీ రైల్వే మంత్రికి కరోనా

రూలింగ్ పార్టీ రైల్వే మంత్రికి కరోనా

పాకిస్థాన్ ప్రస్తుత రైల్వే శాఖా మంత్రి షేక్ రషీద్ అహమ్మాద్ కు సోమవారం కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. పాకిస్థాన్ మాజీ ప్రధానితో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న రైల్వేశాఖా మంత్రి షేక్ రషీద్ అహమ్మాద్ కు ఒకేసారి కరోనా రావడంతో అక్కడి ప్రభుత్వ పెద్దలు షాక్ కు గురైనారు.

 పాక్ లో లక్ష కరోనా కేసులు

పాక్ లో లక్ష కరోనా కేసులు

పాకిస్థాన్ లో ఇప్పటి వరకు 1 లక్షా 8 వేలుకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమొదైనాయి. ఇప్పటి వరకు పాక్ లో 35, 018 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాధితో దాయాది దేశం పాక్ లో 2, 172 మంది మరణించారు. ప్రపంచంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదైన దేశంగా పాకిస్థాన్ 16వ స్థానంలో ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ లో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. రాజకీయ పార్టీల నాయకులతో పాటు పాక్ ప్రజలు సైతం కరోనా వైరస్ భయంతో గజగజ వణికిపోతున్నారు.

English summary
Coronavirus: Pakistan’s former PM Shahid Khaqan Abbasi, Railways Minister Sheikh Rashid test Positive for COVOD- 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X