వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ దుర్మార్గపు ఆలోచన!: రాజస్థాన్ నీళ్లలో విషం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిత్యం భారత దేశం పైన కయ్యానుకు కాలు దువ్వుతూ పాకిస్తాన్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ దారుణానికి ఒడిగట్టే అవకాశాలు లేకపోలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

రాజస్థాన్ సమీపంలోని గ్రామాలకు నీరు అందించే వనరుల్లో పాకిస్థాన్ విషం కలిపే అవకాశాలు ఉన్నట్టు మిలటరీ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జైసల్మేర్, బాద్మర్ జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టారు.

Pakistan's plot to poison water bodies in India!

ఈ రెండు జిల్లాల్లోని నీటి సంఘాలు సైన్యంతో పాటు స్థానికంగా ఉన్న గ్రామాలకూ నీటిని సరఫరా చేస్తాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమయ్యాయని, సెక్యూరిటీ అధికారులు ఈ తరహా చర్యలను అడ్డుకునేందుకు పహారా కాస్తున్నారని నీటి సరఫరా విభాగం తెలిపింది.

ప్రజలను సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇంటికి అలాగే, పబ్లిక్ ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటి విషయంలో.. ఇలా అన్నింటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరో 24 గంటల్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్ల సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ వార్తలు వెలువడటం గమనార్హం.

English summary
Pakistan may poison water bodies in Rajasthan, warns Intelligence; authorities step up vigil
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X