వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ స్పీకర్‌ను వదలని రక్కసి, అసద్ ఖైజర్‌కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. దాయాది పాకిస్థాన్‌లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతలను కూడా వైరస్ వదలడం లేదు. ఇదివరకు సింధు గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్‌కు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆ సంగతి మరవకముందే పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్‌కు కరోనా వైరస్ సోకింది. దీనిని పాకిస్థాన్ వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ధృవీకరించారు.

Recommended Video

Coronavirus Created By Chaina In Wuhan Labs - Donald Trump | Oneindia Telugu

కర్నూలు మెడికల్ కాలేజీ వంట మనిషికి కరోనా .. టెన్షన్ లో వైద్యులు , వైద్య విద్యార్థులుకర్నూలు మెడికల్ కాలేజీ వంట మనిషికి కరోనా .. టెన్షన్ లో వైద్యులు , వైద్య విద్యార్థులు

అసద్‌కు వైరస్ సోకడంతో.. రెండో రాజకీయ నేతకు పాజిటివ్ వచ్చినట్లైంది. ఆయనకు వైరస్ ఎలా సోకిందనే అంశంపై పాకిస్థాన్ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఎవరెవరని కలిశారు.. వారి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం దృష్టిసారించారు. అయితే ఒక్కరోజులో 990 పాజిటివ్ కేసులు నమోదవడం ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 16,817కి చేరింది. పాజిటివ్ కేసులే కాదు ఒకేరోజు వైరస్ సోకిన 24 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 385కి చేరింది.

Pakistan Speaker Asad Qaiser test positive..

పాకిస్థాన్‌లో అధికార పార్టీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరికీ పాజిటివ్ రావడంతో పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ ముఖ్య నేతలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సమీక్షిస్తున్నారు. పార్టీ నేతలకు సోకిన వైరస్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. నేతలు, శ్రేణులు ఆందోళనకు గురికావొద్దని హితవు పలికారు.

English summary
Pakistan's National Assembly Speaker Asad Qaiser has become the latest top politician to be tested positive for the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X