వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ అరాచకాలు: ఆర్తనాదాలు చేస్తున్నా.. హిందువుల బస్తీని నేలమట్టం చేశారు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: మైనార్టీలైన హిందువులపై పాకిస్థాన్ తన అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి పడకుండా ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని ప్రపంచ దేశాలు తమ ప్రజలకు చెబుతుంటే.. పాకిస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకిపెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి

హిందువులు నివాసం ఉంటున్న బస్తీ మొత్తాన్ని నేలమట్టం చేయించి వారందర్నీ నిరాశ్రయులను చేసింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్‌లో ఓ హిందువులు ఉంటున్న బస్తీని పాక్ ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. వద్దంటూ అక్కడి హిందువులందరూ అర్తనాదాలు చేసినా పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

 Pakistan tears down Hindu homes in Bhawalpur.

పాకిస్థాన్ గృహ నిర్మాణ మంత్రి తారీఖ్ బషీర్, దేశ ప్రధాన సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్యవేక్షణలోనే అధికారులు ఈ కూల్చివేతలకు పాల్పడటం గమనార్హం. తమ నివాసాలు నేల మట్టం కావడంతో మండుటెండల్లో కట్టుబట్టలతో ఉండిపోయారు పెద్దలు, పిల్లలు, మహిళలు. ఇటీవల ఖానేవాల్ జిల్లాలో మైనార్టీలైన క్రిస్టియన్ల నివాసాలను కూల్చివేసి తమ రాక్షసవత్వాన్ని చాటుకున్నారు పాక్ పాలకులు.

కాగా, మైనార్టీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల దేశ మానవ హక్కుల సంఘం తీవ్రంగా తప్పబట్టింది. అయినా పాకిస్థాన్ తన అరాచకాలను మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులపై కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే హత్యలు, బలవంతపు మాతమార్పిడులతో పాకిస్థాన్ లో విభజన సమయంలో 23 శాతం కన్నా ఎక్కువగా ఉన్న హిందువుల జనాభా 6 శాతానికి తగ్గిపోయింది.

ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా పాకిస్థాన్ తోపాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో వేధింపులు, వివక్షకు గురై మనదేశంలోకి వచ్చిన అక్కడి మైనార్టీలకు భారత పౌరసత్వం ఇస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Pakistan tears down Hindu homes in Bhawalpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X