వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ చట్ట సవరణకు పాక్ సిద్ధం: కుల్‌భూషణ్ సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చా..?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తమ దేశ ఆర్మీ చట్టాన్ని త్వరలో సవరించనుంది. ఒక వేళ ఆర్మీ చట్ట సవరణ జరిగితే ఆ జైలులో గూఢచర్యం కింద శిక్ష అనుభవిస్తున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ అక్కడి సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్మీ చట్టంలో సవరణలు చేస్తే కుల్‌భూషణ్ జాదవ్ సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని ఈ డెవలప్‌మెంట్స్ పై అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం.

కుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాక్ వియన్నా ఒప్పందంను ఉల్లంఘించిందన్న ఐసీజే అధ్యక్షుడుకుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాక్ వియన్నా ఒప్పందంను ఉల్లంఘించిందన్న ఐసీజే అధ్యక్షుడు

కుల్‌భూషణ్ జాదవ్ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై పాకిస్తాన్ సైన్యం 2016లో ఆయన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత 2017లో మిలటరీ కోర్టు కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పుఇచ్చింది. ఈ శిక్షను ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షియల్ విధించారు. అయితే బలోచిస్తాన్‌లో కుల్‌భూషణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్ వాదిస్తోంది. మార్చి 3, 2016లో కుల్‌భూషన్ జాదవ్‌ను అరెస్టు చేసినట్లు పాక్ చెబుతోంది. అయితే పాక్ ఆరోపణలను భారత్ ఖండించింది.వ్యాపార నిమిత్తం ఇరాన్‌కు వెళ్లిన కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ భద్రతాబలగాలు జాదవ్‌ను కిడ్నాప్ చేశాయని భారత్ ఆరోపించింది.

Pakistan to Amend its Army act,to allow Kulbhushan to appeal in civil court

పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందంటూ ఈ ఏడాది జూలైలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించిందని అభిప్రాయపడింది. కాన్సులర్ యాక్సెస్ ఇవ్వకుండా పాక్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టు నిర్థారించింది. అయితే కుల్‌భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలంటూ పాకిస్తాన్‌ను ఆదేశించింది ఐసీజే. ఈ తీర్పుతో భారత్‌కు సగం విజయం దక్కినట్లయ్యింది. అంతేకాదు కుల్‌భూషణ్‌కు విధించిన మరణ శిక్షపై పునఃసమీక్షించాలని ఐసీజే పాక్‌ను కోరింది. అదే సమయంలో అతని తరపున లాయర్‌ను కూడా పెట్టుకునేందుకు వీలు కల్పించాలని కోరింది. ఐసీజే తీర్పును అనుసరిస్తూ పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే కుల్‌భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్‌కు అనుమతిచ్చింది.

ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పుపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కేసును విచారణ చేపట్టిన 16 మంది జడ్జీల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా ఏకగ్రీవ తీర్పు ఇవ్వగా ఒక్కరు మాత్రం విబేధించారు.

English summary
The Imran Khan government in Pakistan may soon modify its Army Act. If this is done, it would allow Kulbhushan Jadhav to appeal against his conviction on charges of espionage before a civilian court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X