వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషల్ కోర్టుకు తీసుకెళ్తాం.. భారత్ తీరు ఏకపక్షమన్న పాకిస్థాన్ మంత్రి ఖురేషి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేయడంతో దాయాది పాకిస్థాన్ గుర్రుమీదుంది. ఇప్పటికే అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ .. ఈ అంశాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం తన నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు.

కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని భారత్ రద్దు చేయడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేస్తామని చెప్పారు. ఇది సహేతుక నిర్ణయం కాదని అభిప్రాయపడింది. ఆర్టికల్ 370 రద్దుచేసి .. జమ్ముకశ్మీర్ విభజన చేయడంతో పాకిస్థాన్ తన ద్వంద్వనీతిని బయటపెట్టిన సంగతి తెలిసిందే. భారత్‌తో ఉన్న రవాణా మార్గాన్ని రద్దుచేసుకున్నారు. అలాగే పాకిస్థాన్‌లో భారత అంబాసిడర్‌ను కూడా వెనక్కి తీసుకోమ్మని చెప్పడంతో .. తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.

Pakistan to take Kashmir dispute to International Court of Justice after Article 370 move

దీంతో కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఖురేషి ఆరోపించారు. కశ్మీర్‌లో ముస్లింలు ఎక్కువగా ఉంటారని .. దీంతో వారు హక్కులను కోల్పోతారని చెప్పారు. కశ్మీర్‌పై ఇరుదేశాలు సంయమనం పాటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలను తోసిపుచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీ దివంగత ప్రధాని నెహ్రూ విధానాలను తుంగలో తొక్కారని విమర్శించారు. కశ్మీర్ అంశంపై ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో కూడా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పాకిస్థాన్‌కు చుక్కెదురు కావడంతో .. అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తామని బీరాలు పోతుంది.

English summary
pakistan said on Tuesday that it would take the Kashmir dispute with India to International Court of Justice (ICJ), after India revoked special status for Jammu and Kashmir earlier this month, to the fury of Islamabad. "We have decided to take Kashmir case to the International Court of Justice," Pakistan Foreign Minister Shah Mehmood Qureshi told ARY News TV. "The decision was taken after considering all legal aspects," Shah Mehmood Qureshi added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X