వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడ!: భారత్‌పై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పొరుగుదేశం పాకిస్థాన్‌ భారత్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌ పెద్ద గోడను నిర్మించాలని చూస్తోందని పాకిస్థాన్ ఆ ఫిర్యాదులో పేర్కొంది.

పాకిస్థాన్ తరఫున ఐక్యరాజ్యసమితి రాయబారిగా వ్యవహరిస్తున్న మలీహా లోధీ ఈ విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రెండు లేఖలు రాశారు. ఒకటి సెప్టెంబరు 4వ తేదీన, మరొకటి సెప్టెంబరు 9 తేదీల్లో రాసినట్లుగా ఉన్నాయి.

జమ్మూకాశ్మీర్‌, పాకిస్థాన్‌ల గుండా ఉన్నవాస్తవాధీన రేఖ 197 కిలోమీటర్ల పొడవునా.. పది మీటర్ల ఎత్తులో ఈ గోడను నిర్మించాలనుకుంటుందోని ఆ లేఖలో పేర్కొన్నారు.

Pakistan writes to UN about India's plan to build wall along LoC

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని లేఖలో పాక్ పేర్కొంది. అయితే భారత్‌ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంది. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేసింది.

కాశ్మీర్‌లో ఐఎస్, పాక్ జెండాలు ఎగురవేసిన వేర్పాటువాదులు

శ్రీనగర్: ఈద్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో వేర్పాటు వాదులు మరోసారి పాకిస్థాన్ జెండాలను ఎగురవేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం శ్రీనగర్‌లోని ప్రసిద్ధ ఈద్గా ప్రాంతంలో ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.

వారిలో వేర్పాటువాదులు కూడా ఉన్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రార్థనలు ప్రారంభమవటానికి ముందే వేర్పాటు వాదులు పాకిస్థాన్, ఐసిస్ జెండాలు ఎగురవేశారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రక్షణ విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువులు ప్రయోగించారు.

English summary
Pakistan has complained to the UN Security Council about India's plans to construct a wall along the LoC allegedly to convert it "into a quasi international border", drawing a strong reaction from India which said it will respond to this at the "appropriate time".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X