వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ మోడల్‌తో సెల్ఫీ: పదవి పోగొట్టుకున్న మతాధికారి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థానీ ఇంటర్నెట్ సంచలనం, మోడల్ కండిల్ బలోచ్ తాజాగా మరో వివాదానికి కారణమైంది. ఆమెతో దిగిన ఓ మతాధికారి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ మతాధికారి, రాజకీయ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ ఖావితో దిగిన వీడియో బలోచ్ తన ఫేస్‌బుక్ పోస్టులో పోస్ట్ చేసింది.

ఖావి పక్కనే హుందాగా కూర్చుని ఆయన్ని ఆటపట్టిస్తూ ఉన్న వీడియో ఇప్పుడు ఆ పదవికే ఎసరు తెచ్చిపెట్టింది. ఈ వీడియోలో అబ్దుల్ ఖావి సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. దీంతో పాటు బలోచ్ ఆయనతో సెల్ఫీ కూడా దిగింది. ఆయన టోపీ పెట్టుకుని సెల్ఫీ దిగడం పెద్ద సంచలనమైంది.

బలోచ్‌తో సన్నిహితంగా మెలిగినందుకు గాను మతాధికారి పదవి నుంచి ఖావిని మతవ్యవహారాల శాఖ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇఫ్తార్ విందుకు రావాలని ఖావి ఆహ్వానించడంతో ఆయన్ని కలిసేందుకు ఓ హోటల్‌కు వెళ్లానని బలోచ్ వెల్లడించింది. తమ విషయాలు నేర్చుకుంటానని చెప్పడంతో ఆమెను ఆహ్వానించానని ఖావి పేర్కొన్నారు.

నిష్టగా రంజాన్ ఉపవాసం చేస్తానని తనతో బలోచ్ చెప్పిందన్నారు. పాకిస్తానీ మోడల్ అయిన బలోచ్ తనకు కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని ఎంతగానో అందిపుచ్చుకోవడంలో దిట్ట. తాజాగా మతాధికారి ముప్తీ తనకు ప్రపోజ్ చేశారని చెప్పింది. గతంలోనూ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను పాకిస్థాన్ ఓడిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటించి వార్తల్లోకి ఎక్కింది. అయితే బలోచ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

English summary
Mufti Abdul Qavi, a famous Pakistani religious figure and politician has been suspended from his post after selfies with a famous Pakistani internet sensation and model Qandeel Baloch went viral. Mufti Qavi is the head of the religious wing of Pakistan Tehrik-e-Insaf.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X