• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి రేప్ చేశాడు, ప్రధాని, మంత్రి దాడిచేశారు, అమెరికా బ్లాగర్ ఆరోపణలు

|

అమెరికా బ్లాగర్ సింథియా డి రిచీ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తనపై లైంగికదాడి చేశాడని పేర్కొన్నారు. 2011లో అప్పటి మంత్రి రెహమాన్.. తాను మద్యం చేశాక అఘాయిత్యానికి ఒడికట్టాడని తెలిపారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని.. వచ్చేవారంలో మీడియాకు అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం తన ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు.

సెక్స్: పార్క్‌లో యువతిపై లైంగికదాడి, అరుపులు విని కాపాడిన స్థానికులు.. ముగ్గురి అరెస్ట్..

మక్కువ ఎక్కువే..

మక్కువ ఎక్కువే..

పాకిస్తాన్ తనకు రెండో నివాస కేంద్రం అని ఆమె గుర్తుచేశారు. కానీ రెహమాన్ మాలిక్ మాత్రం తనతో తప్పుగా ప్రవర్తించారని నొక్కి వక్కానించింది. అంతేకాదు అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి మఖ్దూం షాబుద్దీన్, మాజీ ప్రధానమంత్రి యూసుఫ్ రాజా గిలానీ కూడా తనపై చేయి చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జలీ జర్దారీ అధికార నివాసం ఇస్లామాబాద్‌లోని ప్రెసిడెంట్ హౌస్‌లో దాడి చేశారని ఆరోపించారు. వీరి ముగ్గురి చేష్టలకు సంబంధించి తన వద్ద ఫుటేజీ ఉందని.. వచ్చేవారంలో విడుల చేస్తామని.. తాను పారదర్శకంగా విషయం చెప్పడం ఓ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా తనకు సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.

సింథియా కంప్లైంట్

సింథియా కంప్లైంట్

పీపీపీ పెషావర్ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్ ఆఫ్ఘానీ సింథియాపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో, ఆమె మాజీ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీతో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. గత వారం బెనజీర్ భుట్టో గురించి సింథియా ఇండిసెంట్ కరస్పాండెంట్: సిక్రెట్ సెక్స్ లైఫ్ ఆఫ్ బెనజీర్ భుట్టో పుస్తకం గురించి ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రె రెహమాన్ గురించి విపులంగా రాశారు. పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని సింథియా రాసుకొచ్చారు.

  #Watch : CC Tv Footage Of Pakistan Plane Crash & Piolets Last Words Before Crash
  ఎవరీ సింథియా..

  ఎవరీ సింథియా..

  సింథియా నేపథ్యం గురించి పూర్తిగా స్పష్టత లేదు. కానీ ఆమె 2009లో పాకిస్తాన్‌లో అడుగిడారు. పర్యాటకురాలిగా వచ్చి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రాజా గిలానీ, విదేశాంగ శాఖమంత్రి రెహమాన్ మాలిక్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. పాకిస్తాన్ ఔన్నత్యం పెంచేందుకు పనిచేసేందుకు నడుం బిగించారు. పీపీపీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా నియమితులై.. చక్రం తిప్పారు. ఆమె ఉర్దూ, కొంచెం పంజాబీలో మాట్లాడతారు. ఫ్రీ లాన్స్ ఫిల్మ్ మేకర్, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తూ.. ఇస్లామాబాద్‌లో జీవిస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లో అధికారం చేతులు మారిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ క్యాంపులో చేరినట్టు తెలుస్తోంది. దీంతో గత హయాంలో జరిగిన తప్పు, లూప్ హోల్స్ గురించి ప్రస్తావిస్తూ ముందుకొస్తున్నారు.

  English summary
  Cynthia D. Ritchie has claimed that Rehman Malik, then Pakistani interior minister, raped her after lacing her drink with sedatives in 2011.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X