వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి యూఏఈ అవార్డు ప్రకటిస్తారా...? మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన పాక్..!

|
Google Oneindia TeluguNews

యూఏఈలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీకి ఆదేశానికి సంబంధించిన అత్యున్నత అవార్డు అందించడంతో దయాదీ పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. ఇందులో భాగంగానే ప్రధానికి ఈ పురస్కారం ప్రకటించగానే పాక్‌ సెనేట్‌ ఛైర్మన్‌ సాధిక్‌ సంజరాని యూఏఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో భారత్‌పై ఉన్న అక్కసును మరోసారి వెల్లగక్కింది. ఈ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం అవుతున్న నేపధ్యంలో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.

Pakistani Senate Chairman Sadiq Sanjrani had canceled the UAE tour.

యూఏఈలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీకి ఆదేశం నుండి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే శనివారం ఆయన్ను ఆర్డర్ ఆఫ్ జాయెద్ మెడల్‌తో యూఏఈ యువరాజు మహ్మద్ బీన్ జాయెద్ మోడీని సత్కరించారు. కాగా అవార్డును దేశాల అధ్యక్షులు,ప్రధానులు,దేశాధినేతలకు ప్రకటిస్తారు. కాగా ఇది యూఏఈలోనే అత్యున్నత పురస్కారం.ఈ అవార్డు యూఏఈ ,భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషికి ఈ అవార్డును అందజేశారు.

గతంలో ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, సాదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ తదితరులు అందుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ రెండు నెలల క్రితం ప్రధాని మోడీకి జాయెద్ మెడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్థాన్ తనకున్న పలుకుబడితో ఐరాసలోని బధ్రతా మండలి సభ్యులు అనధికారిక సమావేశం ఏర్పాటు చేసి కశ్మీర్ అంశంపై చర్చించే విధంగా ప్రయత్నలు చేసింది. కాని పాకిస్థాన్‌ ఆశించినట్టుగా ఆగ్రదేశాల మద్దతు కూడ లభించని విషయం తెలిసిందే..

English summary
Prime Minister Narendra Modi receiving Order of Zayed, UAEs' highest civilian order,but Pakistani Senate Chairman Sadiq Sanjrani had canceled the UAE tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X