వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ గాయని పైత్యం: మోడీని చంపడానికి పాములు, మొసళ్ళు పంపుతోందట(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీని చంపడానికి పాక్ గాయని పాములు, మోసళ్ళు పుంపుతోందట(వీడియో)

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత విషయమే అయినప్పటికీ.. ఆ రాష్ట్రంలో అశాంతిని కోరుకునే పాకిస్థాన్‌కు మాత్రం కళ్లమంట ఆగడం లేదు. పాక్ ప్రధానితోపాటు ఆ దేశంలోని కొందరు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

జీడీపీ కాదు.. 'జీహెచ్‌పీ'ని కోరుకుంటున్నారు: ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలుజీడీపీ కాదు.. 'జీహెచ్‌పీ'ని కోరుకుంటున్నారు: ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

పాక్ గాయని పైత్యం..

పాక్ గాయని పైత్యం..

తాజాగా, ఓ పాకిస్థాన్ గాయని కూడా తన పైత్యాన్ని ప్రదర్శించింది. రబీ ఫిర్జదా అనే పాక్ గాయని.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ గిఫ్టు పంపుతానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ గిఫ్టుతో ఇక భారత్‌కు ప్రధాని ఉండడంటూ వ్యాఖ్యానించింది.

చంపుతానంటూ..

చంపుతానంటూ..

పాములు, మోసళ్లతోపాటు తాను ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది దాయాది దేశ గాయని. వీటన్నింటిని భారత ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇస్తా.. చచ్చి నరకానికి పోయేందుకు సిద్ధంగా ఉండంటూ తన అక్కసును వెళ్లగక్కింది.

బుద్ధి చెబుతున్న భారత నెటిజన్లు..

ఇంకా తనను తాను కాశ్మీరీ యువతి పేర్కొన్న సదరు గాయని.. తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో మాత్రం తాను పాకిస్థానీ పాప్ సింగర్ అని చెప్పుకోవడం గమనార్హం. దీంతో భారత నెటిజన్లు ఆమెకు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. మీ పాకిస్థానీలు ఇక మారరా? అంటూ విమర్శిస్తున్నారు. మీకు చంపడాలు తప్ప మరేం తెలియదా? అంటూ మండిపడుతున్నారు.

మోడీ చిన్నప్పుడే..

నీకైమైనా పిచ్చి లేచిందా? అంటూ విరుచుకుపడుతున్నారు. మీరు పంపే జంతువులు ఇక్కడికి వచ్చి సాదు జీవాలుగా మారిపోతాయని, ఎందుకంటే వాటి దేవుళ్లు ఇక్కడే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. మోడీ చిన్నప్పుడే పాములతో ఆడుకున్నాడు.. ఇవో లెక్కా అంటూ మరో నెటిజన్ ఓ వీడియో పోస్టు చేశారు.

English summary
A video which has hone viral on social media shows Pakistani singer Rabi Pirzada threatening India and Prime Minister Narendra Modi over obrogation of article 370.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X