వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులకు షాక్ ఇచ్చిన పాకిస్థాన్ యూనివర్శిటీ

|
Google Oneindia TeluguNews

లాహోర్: అమ్మాయిలు, అబ్బాయిలు యూనివర్శిటీ క్యాంపస్ లో పక్కపక్కన కుర్చుంటే మీ అంతు చూస్తామని పాకిస్థాన్ లోని యూనివర్శిటీ హెచ్చరించింది. ఇలా జంటగా కుర్చుని దర్శనం ఇచ్చిన వారి మీద తాము కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ అధికారులు హెచ్చరించారు.

ఇస్లామిక్ సిద్దాంతాలకు విరుద్ధంగా విద్యార్థులు ప్రవర్థిస్తున్నారని, తరగతి గదుల్లో, విశ్వ విద్యాలయం ప్రాంగణంలో యువతి, యువకులు పక్కపక్కన కుర్చోరాదని, ఇలా చెయ్యడం ఇస్లామిక్ కు విరుద్దం అని విశ్వ విద్యాలయం డైరెక్టర్ మియాన్ జావేద్ తెలిపారు.

Pakistani University bans boys and girls from sitting as couple

ఇక మీదట తరగతి గదుల్లో, విశ్వ విద్యాలయం ఆవరణంలో యువతి, యువకులు పక్కపక్కన కుర్చోవడం కుదరదని, ఇలా చెయ్యడం మా సాంప్రధాయాలకు విరద్దం అని జావెద్ అంటున్నారు. సాంప్రధాయంతో పాటు పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చెయ్యడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.

ఈ నియమాలను విశ్వ విద్యాలయం కచ్చితంగా పాటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గ్రూపులుగా చేరి విద్యార్థినీ విద్యార్థులు చదువుకు సంబంధించిన చర్చలు జరుపుకోవచ్చని, అయితే ఆ గ్రూప్ లో ఐదు మంది కంటే ఎక్కువ మంది ఉండాలని ఆంక్షలు విధించారు.

పాకిస్థాన్ లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న యూనివర్శిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ విద్యార్థి సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ మీద ఇలాంటి ఒత్తిడి తీసుకు వచ్చారని, తమను వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే యూనివర్శిటీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.

English summary
The Sargodha University Lahore campus yesterday issued a circular banning the one-on-one sittings of male and female students in classroom,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X