వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విచిత్ర పరిస్థితి.. కరోనా భయంతో స్పెర్మ్ బ్యాంకులకు డిమాండ్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ దెబ్బకు అమెరికా ఎంతలా విలవిల్లాడుతుందో కళ్లముందు కనిపిస్తూనే ఉంది. 6లక్షల పైచిలుకు కేసులు 28వేల మరణాలతో.. మున్ముందు ఇంకెంత బీభత్సాన్ని చూడాల్సి ఉంటుందోనన్న ఆందోళనలో ఆ దేశం ఉంది. ఓవైపు ఇలా కరోనా భయం వెంటాడుతున్న తరుణంలోనే.. మరోవైపు కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు కూడా అమెరికాలో చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు చాలామంది కరోనాతో పాటు మరో విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు. కరోనా ఎక్కడ తమ సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందోనని దిగులు చెందుతున్నారు. అందుకే హడావుడిగా స్పెర్మ్ బ్యాంకులను సంప్రదించి ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా మొదలుపెట్టేస్తున్నారు.

ఎందుకీ కంగారు...

ఎందుకీ కంగారు...

కరోనా కారణంగా ప్రాణాలేమో గానీ ఎక్కడ వారసత్వం లేకుండా పోతుందేమోనన్న బెంగ అమెరికన్లకు పట్టుకుంది. సంతానోత్పత్తిపై,స్పెర్మ్ కౌంట్‌పై కరోనా ప్రభావం చూపిస్తుందనడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అమెరికన్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అయితే మార్చి నెలాఖరులో వచ్చిన ఓ ఊహాజనిత అధ్యయనం ఈ పరిస్థితి కారణమైనట్టు తెలుస్తోంది. దాని ప్రకారం కరోనా కారణంగా ఎవరైతే ఎక్కువ ఆందోళనకు లోనవుతారో... అది దీర్ఘ కాలంలో వారి స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ఊహాజనితమే తప్ప దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక గతంలో వచ్చిన సార్స్,ఇతర కరోనా వైరస్‌లు పురుషుల్లో వృషణాల వాపుకు కారణమయ్యాయన్న కథనాలు కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదంతా నిజమేనని ఇప్పుడు చాలామంది అమెరికన్లు అపోహ పడుతున్నారు.

పెరిగిన స్పెర్మ్ బ్యాంక్ కిట్ల అమ్మకాలు..

పెరిగిన స్పెర్మ్ బ్యాంక్ కిట్ల అమ్మకాలు..

ఈ నేపథ్యంలో అమెరికాలో స్పెర్మ్ బ్యాంకులకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. చాలామంది అమెరికన్లు స్పెర్మ్ బ్యాంకులను సంప్రదించి ముందు జాగ్రత్తగా తమ స్పెర్మ్‌ను నిల్వ చేసుకుంటున్నారు. స్పెర్మ్ బ్యాంకులు ఇంటి వద్ద నుంచే ప్రత్యేక కిట్ల ద్వారా స్పెర్మ్‌ను సేకరించి వాటిని పరీక్షిస్తాయి. అనంతరం సేకరించిన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకుల్లో భద్రపరుస్తాయి. ఈ క్రమంలో 'క్రైయోఛాయిస్' లాంటి స్పెర్మ్ బ్యాంక్ కిట్ల అమ్మకాలు ఇప్పుడు ఏకంగా 20శాతం మేర పెరిగిపోయాయి. డాడి అనే మరో స్పెర్మ్ బ్యాంక్ కిట్ల అమ్మకాలు కూడా ఏకంగా మూడు రెట్లు పెరిగాయని ఆ సంస్థ సైన్స్ డైరెక్టర్ గ్రేస్ సెంటోలా తెలిపారు. తమను సంప్రదించే చాలామంది కస్టమర్లు కరోనా కారణంగా విపరీతమైన ఆందోళనలో ఉన్నారని.. స్పెర్మ్ స్టోరేజీకి తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు.

స్త్రీలకు కూడా భయం పట్టుకుంది..

స్త్రీలకు కూడా భయం పట్టుకుంది..

పురుషులకే కాదు స్త్రీలకు కూడా ఈ భయం పట్టుకుందని అక్కడి సంతానోత్పత్తి నిపుణులు చెబుతున్నారు. కరోనా భయంతో తమలో అండాలు సరిగా విడుదలవుతున్నాయో లేదో పరీక్షలు చేయించుకునేందుకు చాలామంది మహిళలు ఆసుపత్రులకు వస్తున్నట్టు మాన్‌హట్టాన్‌లోని ఓ సంతానోత్పత్తి క్లినిక్ వెల్లడించింది. చాలామంది పురుషులు,స్త్రీలు తమకు ఫోన్లు చేసి.. సంతానోత్పత్తిపై కరోనా ప్రభావం గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు. ఇందులో చాలామంది పురుషులు ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో స్పెర్మ్‌ను నిల్వ చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్టుగా వెల్లడించారు.

అమెరికాలో కరోనా తీవ్రత..

అమెరికాలో కరోనా తీవ్రత..

ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నవేళ.. అమెరికాలో స్పెర్మ్ బ్యాంక్స్ కిట్ల అమ్మకాలు,సేవలకు డిమాండ్ పెరగడం గమనార్హం. ఇక కరోనా కేసుల విషయానికొస్తే.. ఇప్పటివరకూ 644,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 48,708 మంది కోలుకోగా.. 28,529 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా న్యూయార్క్‌లోనే 11,586 మంది మృతి చెందారు. న్యూయార్క్‌లో ఇప్పటివరకు మొత్తం 214,648 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో 71,030,మసాచూట్స్‌లో 29,918,మిచిగాన్‌లో 28,059 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

Emotional Video Between Father And Daughter Melts Your Heart

English summary
Men are not only worried about COVID-19 killing them, but they now fear that the coronavirus pandemic will also decimate their legacies.While operations that keep sperm cryogenically alive have not been deemed essential, business is booming at semen storage facilities,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X