వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలేంటి ప్యారడైజ్ పేపర్స్?: రహస్య ఒప్పందాలు లీక్, లిస్టులో కెనడా ప్రధాని కూడా!

బెర్ముడా తదితర ప్రాంతాల్లో ఉన్న ఆఫ్‌ షోర్‌ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లనే పార్యడైజ్‌ పేపర్లుగా పరిగణిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్యారడైజ్ పేపర్స్ లీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. చాలా రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఇందులో పేర్కొనడంతో వారి ఆర్థిక లావాదేవీలపై చర్చ జరుగుతోంది.

సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్?: చిక్కుల్లో అమితాబ్, ఆ కంపెనీలో పెట్టుబడులపై అనుమానాలు!..సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్?: చిక్కుల్లో అమితాబ్, ఆ కంపెనీలో పెట్టుబడులపై అనుమానాలు!..

తాజా పేపర్స్ లో ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని చాలా ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల విషయాలు బయటపడ్డాయి. పన్ను ఎగ్గొట్టేందుకే చాలామంది ప్రముఖులు కేవలం పేపర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాస్-రష్యా ఒప్పందం లీక్

రాస్-రష్యా ఒప్పందం లీక్

అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్‌బర్‌ రాస్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులకు చెందిన షిప్పింగ్‌ కంపెనీ వ్యాపార సంబంధాలు కూడా తాజాగా బయట పడ్డాయి. ఇంటర్నేషనల్‌ కన్సోర్టియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) ఇందుకు సంబంధించిన ప్యారడైజ్‌ పేపర్లను లీక్‌ చేసింది. ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ ఆఫ్‌ షోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేపర్లలో ఉండటం గమనార్హం.

 చిక్కుల్లో కెనడా ప్రధాని

చిక్కుల్లో కెనడా ప్రధాని

ప్యారడైజ్ పేపర్స్ లీక్‌లో దేశ ప్రధానుల పేర్లు కూడా వినిపిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూకు చెందిన టాప్ ఫండ్ రైజర్, సీనియర్ సలహాదారు స్టీఫెన్ బ్రౌన్ఫ్ మన్ ల పేర్లు కూడా ప్యారడైజ్ పేపర్లలో ఉన్నాయి. కెనడా ప్రధానికి చెందిన సన్నిహిత వర్గం పన్నును ఎగ్గొట్టేందుకే మాజీ సెనేటర్ లియో కొల్బెర్ తో కలిసి 60మిలియన్ డాలర్లు సీ గ్రామ్ ఫార్చూన్ తో పెట్టుబడి పెట్టినట్టు ఐసీఐజే పేర్కొంది. దీంతో ప్రధాని ట్రుడూ సమస్యల్లో చిక్కుకునే అవకాశముంది.

 బ్రిటన్ రాణి ఎలిజబెత్-2

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2

ఇక బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 పేరు కూడా ప్యారడైజ్ పేపర్స్ నుంచి లీకైంది. కేమన్‌ ద్వీపాలు, బెర్ముడాల్లో క్వీన్‌ 13 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్టు అందులో వెల్లడైంది. రెంట్ టూ బై రీటైలర్‌ను బ్రైట్‌ హౌస్‌ను కూడా క్వీన్‌ కొనుగోలు చేసినట్టు ఇందులో పేర్కొన్నారు. ఈ విషయాలు రహస్యంగా ఉంచడం పట్ల వీటి లావాదేవీల మీద పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

అయితే పన్ను ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాస్‌, ఎలిజబెత్‌ 2, బ్రౌన్ఫ్‌మన్‌లు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అదే సమయంలో రాస్‌కు రష్యా కంపెనీలతో సంబంధాలు ఉండటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

 అసలేంటి ప్యారడైజ్ పేపర్స్:

అసలేంటి ప్యారడైజ్ పేపర్స్:

బెర్ముడా తదితర ప్రాంతాల్లో ఉన్న ఆఫ్‌ షోర్‌ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లనే పార్యడైజ్‌ పేపర్లుగా పరిగణిస్తున్నారు. దాదాపు 13 లక్షల 40 వేల ప్యారడైజ్‌ పేపర్లను సేకరించిన ఐసీఐజే.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వివరాలను బయట పెట్టింది. ఈ పేపర్లను తొలుత జర్మనికి చెందిన న్యూస్‌పేపర్‌ సుడ్డేట్చే జీటంగ్‌ సంపాదించినట్టు సమాచారం. అయితే పేపర్స్ లో అక్రమాలపై కచ్చితమైన నిర్దారణ కోసం ఐసీఐజే పలు మీడియా సంస్థల సహాయం కూడా కోరినట్టు తెలుస్తోంది.

English summary
A huge new leak of financial documents has revealed how the powerful and ultra-wealthy, including the Queen's private estate, secretly invest vast amounts of cash in offshore tax havens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X