వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో పార్సిల్ బాంబుల కలకలం:ఒబామా‌, హిల్లరీ కార్యాలయాలకు ఈ పార్సిళ్లు!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌:అమెరికాలో పార్సిల్ బాంబులు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. దేశంలోని పలు కీలక కార్యాలయాలకు పేలుడు పదార్థాలతో కూడిన పార్శిళ్లు వచ్చాయి. అయితే వీటిని నిఘా అధికారులు చాలా వరకు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ పేలుడు పదార్థాలతో కూడిన పార్సిళ్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా‌, మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌ చిరునామాల మీద కూడా వచ్చినట్లు అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. దీనిపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేస్తుండగా...అసలు ఈ పార్సిల్ బాంబుల రాక వెనుక సూత్రధారులెవరో కనుగొనేందుకు అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌ రంగంలోకి దిగింది.

Parcel Bombs sent to Obama, Clinton; explosives scare at CNN TV

అమెరికా లో విఐపిలు, కీలక కార్యాలయాలే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు పంపుతున్న పార్సిల్ బాంబులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా‌, మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌ చిరునామాల మీద కూడా ఈ పేలుడు పదార్థాల పార్శిల్స్‌ వచ్చినట్లు అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌ ప్రకటించింది.

న్యూయార్క్‌లోని హిల్లరీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పేలుడు పదార్థాలతో కూడిన ప్యాకెట్‌ను సీక్రెట్‌ సర్వీసెస్‌ ఉద్యోగి స్కానింగ్‌ చేస్తుండగా అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదే క్రమంలో వాషింగ్టన్‌లోని ఒబామా కార్యాలయానికి వచ్చిన ఒక పార్శిల్‌లోనూ పేలుడు పదార్థాలు ఉన్నాయని తనిఖీలో బైటపడింది. ఇటీవలే బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఇంటికి కూడా ఇలాంటి పార్శిళ్లే రాగా...ఇప్పుడు ఏకంగా ఒబామా, హిల్లరీ కార్యాలయాలకే పంపడం కలకలం రేపుతోంది.

రెండు రోజుల క్రితం బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తులు పార్శిల్‌ ద్వారా పేలుడు పదార్థాలను పంపించగా...సోరోస్‌ ఇంటికి వచ్చిన పార్శిల్‌ను తనిఖీ విభాగం స్కానింగ్‌ చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఆ ప్యాకెట్‌ను తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేసినట్లు యూఎస్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు న్యూయార్క్‌లో మీడియా కార్యాలయాలు ఉన్న టైమ్‌ వార్నర్‌ సెంటర్‌ భవనంలోనూ పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఒక వస్తువును కనుగొన్నట్లు సీఎన్‌ఎన్‌ టివి ఛానెల్ పేర్కొంది. దీంతో ఈ భవనంలోని అన్ని కార్యాలయాలను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌ అధ్యక్షుడు జెఫ్‌ జుకెర్‌ తమ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ లో వెల్లడించారు.

అలాగే అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ కు కూడా ఒక అనుమానాస్పద పార్శిల్‌ వచ్చినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొనడం కలకలం రేపుతోంది. దీనిపై సీక్రెట్‌ సర్వీస్‌ స్పందిస్తూ తాము కేవలం ఒబామా, క్లింటన్‌ కార్యాలయాలకు వచ్చిన పార్శిళ్లను మాత్రమే స్వాధీనం చేసుకొన్నామని...వైట్ హౌస్ కు ఇలాంటి పార్సిల్ వచ్చినట్లు సమాచారం లేదని తెలిపింది.

అయితే ఈ పార్సిల్ బాంబులపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పార్శిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయం తెలియరాలేదని...అందువల్లే వీటికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిసింది. మరోవైపు ఒబామా, బిల్‌ క్లింటన్‌, ఇతర ప్రముఖులపై పార్సిల్ బాంబులతో దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి సారా శాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా కేవలం భయపెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

English summary
America:Explosive devices and suspicious packages have been sent to leading Democratic figures and CNN, officials said Wednesday ...just days after a bomb was found in the mailbox of billionaire George Soros. An explosive device was discovered early Wednesday at Hillary and Bill Clinton’s Chappaqua home, while another one addressed to former President Barack Obama was intercepted in Washington, DC, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X