వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పనే, ప్రవక్తకు గౌరవరం: ప్యారిస్ దాడులపై ఆల్ ఖైదా

By Pratap
|
Google Oneindia TeluguNews

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో దాడులు తమ పనే అని యెమన్ ఆల్ ఖైదా ప్రకటించుకుంది. ప్యారిస్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డోపై దాడికి పాల్పడింది తామేనని చెప్పుకుంది. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. చార్లీ హెబ్డోపై దాడి చేసిన 12 మందిని హతమార్చిన సంఘటన తమ ఆదేశాల మేరకే జరిగిందని చెప్పింది.

ఇస్లామ్ ప్రవక్త మొహమ్మద్ గౌరవార్థం ప్రతీకార చర్యగానే ఈ దాడికి పాల్పడినట్లు ఆల్ ఖైదా సభ్యుడు చెప్పాడు. భద్రతా కారణాల రీత్యానే ఆల్ ఖైదా దాడులపై ఆలస్యంగా ప్రకటన విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆల్ ఖైదానే ఈ దాడులకు పాల్పడిందా, దాడులకు సహకరించిందా అని తెలుసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Paris attacks: Al Qaeda claims responsibility

చార్లీ హెబ్డోపై దాడి చేసినవారిలో ఒకడైన చెరిఫ్ యెమెన్‌కు చెందిన ఆల్ ఖైదా తరఫున తాము ఈ దాడి చేసినట్లు ఫ్రెంచ్ టీవీకి చెప్పాడు. మరిన్ని దాడులు చేస్తామని అరేబియా ద్వీపంలో ఉన్న ఆల్ ఖైదా షరియా అధికారి హరీత్ ఆల్ - నథారీ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

ముస్లింలపై దాడులను ఆపేయాలని, అప్పుడు సురక్షితంగా ఉంటావని, లేకుంటే యుద్ధం తప్పదని అతను అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్ ఖైదా ప్రకటనతో విభేదిస్తూ పారిస్ దాడులు తమ పనే అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. బ్రిటన్, అమెరికాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించింది.

తమ ఆపరేషన్ ఫ్రాన్స్‌తో ప్రారంభించామని, ఇక ముందు బ్రిటన్, అమెరికా, తదితర దేశాలపై చేస్తామని ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.

English summary
A day after France forces brought the two sieges to a bloody end, an al Qaeda associate in Yemen late on Friday said that the group was responsible for carrying out terror attack on the Paris' satirical newspaper Charlie Hebdo, reports stated on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X