వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేకతలివే: మంటల్లో ప్రఖ్యాత పారిస్ రిట్జ్ హోటల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఫైవ్‌స్టార్ రిట్జ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. హోటల్లో మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో హోటల్‌లోని ఏడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

దీంతో వెంటనే అప్రమత్తమై సెంట్రల్ పారిస్‌లోని వీధుల్లోని షాపులను మూసివేశారు. రిట్జ్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని టూవీలర్స్‌పై వెళ్లే వారు హోటల్ వైపు వెళ్లొద్దని పారిస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ట్విట్టర్‌లో ఆ దేశ ప్రజలకు సమాచారమిచ్చారు.

Paris's Ritz Hotel Hit by Fire During Overhaul; No Injuries

వెంటనే 60 మంది అగ్నిమాపక సిబ్బంది, 15 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 1997లో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే ముందు రోజు రాత్రి ప్రిన్సెస్‌ డయానా ఈ హోటల్‌ లోనే బస చేశారు. ఇదే హోటల్‌లో చార్లీ చాప్లిన్, ఎర్నెస్ట్ హెమ్మింగ్‌వేలు బస చేసేవారు.

ప్రస్తుతం హోటల్‌కు మరమ్మత్తులు చేస్తున్నారు. దీంతో హోటల్‌లో అతిథులు, వినియోగదారులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మూడేళ్ల మూసివేత తర్వాత మార్చి 20 నుంచి రిజ్జ్ హోటల్‌‌లో ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా తెరవనున్నారు. రిజ్ట్ హోటల్‌లో ఒక రాత్రి బస చేసేందుకు గాను 1,100 యూరోలు ఛార్జీ చేస్తారు.

English summary
A fire broke out on the seventh floor of the luxury Ritz hotel, which is under renovation, forcing several major streets to be shut in central Paris during the morning rush hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X