వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా కొత్త రికార్డు: సూర్యునికి దగ్గరగా పార్కర్ సోలార్ ప్రోబ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లిన స్పేస్ ‌క్రాఫ్ట్‌గా నాసాకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ రికార్డు సృష్టించింది. సూర్యునిలో దాగిఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ రాకెట్లను సూర్యుని సమీపంలోకి పంపించింది నాసా. ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది ఒక రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్. సూర్యుని దగ్గరకు వెళ్లిన స్పేస్‌క్రాఫ్టలలో జర్మన్ అమెరికన్ హీలియోస్ 2 స్పేస్ క్రాఫ్ట్ పేరు మీద ఉంది. ఇది 1976 ఏప్రిల్‌లో సూర్యునికి సమీపంలోకి వెళ్లింది. అంటే సూర్యునికి 26.55 మిలియన్ దూరం వరకు వెళ్ళింది. అయితే ఈ రికార్డును పార్కర్ సోలార్ ప్రోబ్ ఎయిర్‌క్రాఫ్ట్ తిరగరాసింది.

నవంబర్ 2 నాటికి 15 మిలియన్ మైళ్ల దూరంలో పార్కర్ సోలార్ ప్రోబ్

నవంబర్ 2 నాటికి 15 మిలియన్ మైళ్ల దూరంలో పార్కర్ సోలార్ ప్రోబ్

సూర్యుడి బాహ్య వాతావరణం చేరుకునే వరకు పార్కర్ సోలార్ ప్రోబ్ పయనిస్తూనే ఉంటుంది. ఇక వచ్చే వారం నాటికి ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యునికి కేవలం 15 మిలియన్ మైళ్ల దూరానికి చేరుకుంటుంది. ఇక రానున్న ఏడేళ్లలో సూర్యుడి సమీపానికి 24 సార్లు చేరుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇది సూర్యుడికి 3.8 మిలియన్ మైళ్ల దూరంలో ఉండే అవకాశం ఉంది.

స్పేస్ క్రాఫ్ట్‌కు ఖగోళశాస్త్రవేత్త యూజిన్ పార్కర్ పేరు పెట్టిన నాసా

స్పేస్ క్రాఫ్ట్‌కు ఖగోళశాస్త్రవేత్త యూజిన్ పార్కర్ పేరు పెట్టిన నాసా

నాసా నుంచి తొలిసారిగా సూర్యుడి సమీపంలోకి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్‌కు ఆ పేరు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త యూజిన్ పార్కర్ పేరు పెట్టడం విశేషం. ఈ ఏడాది ఆగష్టులో ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్న సమయంలో ఆయన అక్కడే ఉండి ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పుడు ఆయన వయస్సు 91 ఏళ్లు. ఇదిలా ఉంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి రాకెట్‌ను పంపి సూర్యుడిలో దాగి ఉన్న అంశాలను ప్రపంచానికి తెలియజేయాలని నాసా 1958లోనే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇది ఇప్పటికీ నెరవేరింది.

అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్ డిజైన్

అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్ డిజైన్

ఆనాటి సాంకేతికత ఇందుకు సహకరించలేదు. ఒకవేళ సూర్యుడి దగ్గరకు వెళ్లిన సమయంలో భానుడి నుంచి వెలువడే వాయువులను తట్టుకునే శక్తి ఈ ప్రోబ్‌కు ఉండాలి. అంతేకాదు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా రాకెట్ కూడా పరివర్తన చెందాల్సి ఉంటుంది. అప్పుడు సాధ్యం కానీ అంశాలన్నీ ఇప్పుడు టెక్నాలజీతో సాధ్యమయ్యాయి. ఎంతటి వేడిమినైనా తట్టుకునేలా శాస్త్రవేత్తలు రాకెట్‌ను డిజైన్ చేశారు. ఈనెల మొదట్లో శుక్రగ్రహం నుంచి కేవలం 1500 మైళ్ల దూరంలో పార్కర్ సోలార్ ప్రోబ్ పయనించింది.

English summary
NASA has confirmed that its Parker Solar Probe is now closer to the sun than any spacecraft has ever been.It has beaten the record of 26.55 million miles set by Helios-2 in 1976.The probe will keep getting closer to the sun until it flies through the corona, or outer atmosphere, for the first time next week, passing within 15 million miles of the solar surface.Over the next seven years it will make 24 close approaches to the sun, ultimately coming within just 3.8 million miles of the surface.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X