వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాస్టిక్ డబ్బాలో వైన్, తాడు సాయంతో మరో భవనంలోకి, సంధ్యవేళ ఛీర్స్ కొడుతూ సెలబ్రేట్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో మార్చి నెలలో వెనిజులాల్లో క్వారంటైన్‌లో ఉండాలని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో జనం అంతా ఇంటికి పరిమితమయ్యారు. బయట అడుగుపెట్టకపోవడం, స్నేహితులను కలుసుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్ బెర్టా లోపెజ్‌ను ఆలోచింపజేసింది. సాయంత్రం కాగానే తన భవనంపైకి ఎక్కి అటు ఇటు తిరిగేవారు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు కూడా పైకి వచ్చి.. సంగీతం వినేవారు.. దీనిని ఆమె గమనించారు.

సాయంత్రం ఎలాగూ పైకి వస్తున్నాం.. వచ్చిన సమయంలో వైన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అనుకొన్నారు. వెంటనే ఫ్రెండ్స్‌తో మాట్లాడారు. వారి సహాయంతో.. ప్లాస్టిక్ డబ్బాలో కొంత వైన్ పోసి.. దానిని తాడు సాయంతో సమీపంలోని భవనానికి పంపించేందుకు ప్రయత్నించి.. సక్సెస్ అయ్యారు. ఆ డబ్బా రాగానే మరో భవనంలో ఉన్నవారికి వైన్ పంపేవారు. మిగతా భవనాల్లో ఉన్న వారు కూడా వైన్ షేర్ చేసేవారు. ఇలా సాయంత్రం పూట.. భౌతికదూరం పాటిస్తూ చీర్స్ కొడుతూ వైన్ తాగేవారు.

pass wine across rooftops..Neighbours celebrate happy hour in quarantine

కారకాస్లోని లాస్ పాలోస్ గ్రాండెస్ వద్ద మూడు భవనాల్లో ఇలా వైన్ షేర్ చేసుకుంటూ కనిపించారు. ఇక్కడనుంచి ఎల్ అవిలా పర్వతం కనిపిస్తోంది. 25 మైళ్ల దూరంలో కరేబియన్ సముద్రం కూడా ఉంది. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వైన్‌తో మొదలైన షేరింగ్ ప్రక్రియ.. మధ్యాహ్నం కాఫీ, రాత్రి విందు సమయాల్లో కూడా కలుసుకొనే అవకాశం కలిగించింది. క్వారంటైన్ సమయంలో డబా పై నుంచి పొరుగువారితో గడిపే అవకాశం కలిగిందని లోపేజ్ తెలిపారు. సోషల్ మీడియా, మొబైల్ కన్నా... ప్రకృతిలో మమేకమై కలుసుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని లోపెజ్ అభిప్రాయపడ్డారు.

English summary
Venezuela ordered quarantine in March to prevent the spread of the novel coronavirus, real estate agent Berta Lopez was unsure how she would pass the time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X