వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30వేల అడుగుల ఎత్తులో ప్లేన్ డోర్ తెరవబోయాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: విమానంలో 30వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో.. విమానం డోర్ తెరిచేందుకు స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే, ఎడిన్‌బరో నుంచి ఆమ్‌స్టర్‌డామ్ వెళ్తున్న కేఎల్ఎం విమాన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

విమానంలో ప్రయాణిస్తున్న జేమ్స్ గ్రే అనే వ్యక్తి 30,000 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా.. తలుపు తెరవబోయాడు. అతని ప్రయత్నాన్ని గమనించిన సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు.

అత్యవసరంగా టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి ఉన్న కారణంగా... అది టాయ్‌లెట్ డోర్ అనుకుని తెరవడానికి ప్రయత్నించానని, అది మెయిన్ డోర్ అనుకోలేదని విచారణలో తెలిపాడు. అతనికి అధికారులు 44,000 రూపాయలు జరిమానా విధించి, ఐదేళ్ల పాటు కేఎల్ఎం విమానం ఎక్క కూడదని ఆదేశించారు.

Passenger who tried to open plane door at 30000ft 'thought it was a toilet'

ప్రాణాలు కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచీ

అమెరికాలో ఓ యువకుడి ప్రాణాలను అతను ధరించిన స్మార్ట్ వాచీ కాపాడింది. పాల్ హూలే అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడి హృదయ స్పందన రేటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటాన్ని స్మార్ట్ వాచీ గుర్తించి వెంటనే హెచ్చరించింది. దాంతో వెంటనే ఆ యువకుడ్ని హాస్పిటల్‌కు తరలించారు.

చికిత్సను అందించారు. మసాచుసేట్స్‌లోని మారియన్‌లో ఉన్న టాబర్ అకాడమీ సీనియర్ క్రీడాకారుడైన పాల్ గరిష్ఠ ఉష్ణోగ్రతలో ఏకబిగిన రెండు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. నొప్పి రావడంతో తన గదికి వచ్చి విశ్రాంతికి ఉపక్రమించాడు.

తన చేతికి ధరించిన ఆపిల్ వాచీ మానిటర్‌లో సాధారణ స్థాయిలో ఉండే హృదయ స్పందన రేటు నిమిషానికి 145 సార్లు కొట్టుకుంటున్నట్లు చూపించింది. తొలుత వాచీ పాడైపోయిందని పాల్ భావించాడు. తన కోచ్, స్కూల్ నర్సు పరిస్థితిని గమనించి ఎమర్జెన్సీ రూంకు తరలించారు.

దేహంలోని కండరాలు విచ్ఛిన్నమై రక్తంలోకి ఓ రకమైన ప్రొటీన్లు విడుదలై కీలక అవయవాలు విఫలమయ్యే లక్షణాలున్న రాబ్డోమయోలిసిస్‌కు గురయ్యాడని గుర్తించారు. ఈ పరిస్థితిని పట్టించుకోకుండా మళ్లీ ప్రాక్టీస్‌కు వెళ్లి ఉంటే ప్రాణాలతో మిగిలి ఉండేవాడివి కాదని వైద్యులు హెచ్చరించారని పాల్ తెలిపారు.

English summary
Passenger who tried to open plane door at 30000ft 'thought it was a toilet'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X