వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ పాస్టర్ పంట పండినట్లే.. తవ్వకాల్లో బయటపడిన 706 క్యారెట్ల డైమండ్

సియెరా లియోన్ లోని ఓ పాస్టర్ 706 క్యారెట్ల డైమండ్ ను వెలికితీశారు. ఇది డైమండ్ల చరిత్రలో బయటపడిన పదో అతిపెద్ద స్టోన్ గా గుర్తించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఫ్రీటౌన్: సియెరా లియోన్ లోని ఓ పాస్టర్ 706 క్యారెట్ల డైమండ్ ను వెలికితీశారు. ఇది డైమండ్ల చరిత్రలో బయటపడిన పదో అతిపెద్ద స్టోన్ గా గుర్తించారు. అనధికార తవ్వకాల్లో భాగంగా ఇమ్మాన్యుయేల్ మోమో అనే పాస్టర్ కి ఈ డైమండ్ దొరికింది.

ప్రభుత్వ అనుమతితో సొంతంగా తవ్వకాలు జరిపిన మోమోకే.. ఈ డైమండ్ అమ్మకం హక్కులు దక్కుతాయి. దీనిని విక్రయించగా వచ్చిన మొత్తంలో 4 శాతం మాత్రం ప్రభుత్వానికి వెళుతుంది. మరికొంత ఆదాయపన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డైమండ్ ను తొలుత పాస్టర్ మోమో దేశాధ్యక్షుడు ఎర్నెస్ట్ బై కొరోమాకు అందజేశారు. ఆ తరువాత దానిని ఫ్రీ టౌన్ సెంట్రల్ బ్యాంక్ లాకర్ లో దాచి ఉంచారు. వివాద రహిత డైమండ్లను గుర్తించే కింబర్లీ ప్రక్రియ కింద ఇది ఉంది. ఇక్కడే దీని విలువను కూడా నిర్ధారిస్తారు.

Pastor in Sierra Leone finds one of world's largest uncut diamonds

తరువాత ఈ డైమండ్ ను బిడ్డింగ్ లో ఉంచి అమ్మకానికి పెడతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డైమండ్ క్వాలిటీ గుర్తించిన తరువాత ఇది పది నుంచి పదిహేనో ర్యాంకులో నిలుస్తుందని అమెరికాకు చెందిన డైమండ్ నిపుణుడు పాల్ జిమ్నస్కీ తెలిపారు.

అత్యాధునిక మిషన్లు ఉపయోగించకుండా.. కేవలం చిన్న చిన్న వస్తువులు, చేతులతో తవ్వకాలు జరిపే అక్కడి వ్యక్తులు ఇలాంటి విలువైన డైమండ్ ను గుర్తించడం అనూహ్యమే. దీనిని సియెరా లియోన్ లో కాకుండా బయట అమ్మితే మరింత విలువ వచ్చే అవకాశం ఉన్నట్లు జిమ్నిస్కీ అభిప్రాయపడ్డారు.

డైమండ్ రంగు, నాణ్యత తెలియకుండా దానికి విలువ కట్టడం అసాధ్యం, అయితే ఇంతకుముందు లభించిన 726 క్యారెట్ల పాలిష్ట్ డైమండ్ ఈ ఏడాది మేలో అమ్మకానికి వస్తోంది. ఇందులో 25 క్యారెట్ల ముక్క.. 22 లక్షల నుంచి 36 లక్షల డాలర్ల ( మన రూపాయల్లో 14.41 కోట్ల నుంచి 23.5 కోట్లు) కు అమ్ముడు పోవచ్చని అంచనా.

అంటే ఒక్కో క్యారెట్ రూ.57 లక్షల నుంచి రూ.94 లక్షలు పలకనున్నట్లు జిమ్నిస్కీ తెలిపారు. మరి ఈ లెక్కన తాజాగా పాస్టర్ మోమో కనుగొన్న 706 క్యారెట్ల డైమండ్ విలువ ఇంకెంత ఉంటుందో? మొత్తానికి పాస్టర్ ఇమ్మాన్యుయేల్ మోమో పంట పడినట్లే!

English summary
A pastor in Sierra Leone has found one of the world's largest uncut diamonds and passed it to the country's president. Emmanuel Momoh found the 706 carat diamond in the eastern region of Kono. He handed it to a local chief who then passed it on to Sierra Leone's president Ernest Bai Koroma in the capital Freetown. It is now being stored in the central bank, according to government sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X