వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ఇచ్చిన ఆధారాలతో పట్టుకోండి: నవాజ్ షరీఫ్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రదాడిపై భారత్ ఇచ్చిన ఆధారాలతో సూత్రధారులను పట్టుకోవాలంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి కీలక సమావేశం నిర్వహించారు.

శుక్రవారం జరిపిన రెండో రోజు సమావేశంలో ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, అంతర్గత మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్, ప్రత్యేక సలహాదారు తారీఖ్ ఫతేమీ, జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) నస్సెర్ ఖాన్ జంజువా, విదేశీ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి, ఇంటలిజెన్స్ బ్యూరో ఛీఫ్ అఫ్తాబ్ సుల్తాన్ పాల్గొన్నారు.

పఠాన్‌కోట్ దాడి సూత్రధారులను పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని నవాజ్ షరీఫ్.. సుల్తాన్‌ను ఆదేశించారు. అలాగే, భారత్-పాక్‌ల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరిగేలా భారత జాతీయ సలహాదారుతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ జంజువాను షరీఫ్ ఆదేశించారు.

Pathankot: Sharif asks IB to probe Indian leads on terror attack

షరీఫ్ గురువారం కూడా పాక్ ఆర్మీ చీఫ్‌తో పాటు కేబినెట్ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పఠాన్‌కోట్ దాడిపై చర్చించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా, పఠాన్‌కోట్ దాడి జరిగిన అనంతరం పాక్ ప్రధాని షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఘటనపై సమాచారం తెలుసుకున్న విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని షరీఫ్.. మోడీకి హామీ కూడా ఇచ్చారు.

జనవరి 2న పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భారత సైనికులు మృతి చెందగా, సైన్యం కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

English summary
Prime Minister Nawaz Sharif has asked the Intelligence Bureau to probe the leads provided by India on the alleged Pakistani links to the terror attack in Pathankot, a report said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X