వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడా..: రెప్పపాటులో తప్పిన ప్రమాదం, ఆడి కారు పల్టీల నుంచి తప్పించుకొన్న బాటసారి.

|
Google Oneindia TeluguNews

భూమి మీద నూకలు ఉండాలే గానీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా తప్పించుకోగలుగుతారు. ప్రమాదం అంటే గాయాలతో కాకుండా.. రెప్పపాటులో ప్రమాదం నుంచి మిస్సయిన ఘటనలు చాలా తక్కువ. బ్రిటన్‌లోని వెస్ట్ యార్క్ షైర్‌లో కూడా అలాంటి ఘటనే జరిగింది. శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి విజువల్స్ ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి.

వెస్ట్ యార్క్ షైర్‌లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఓ ట్రక్కు వెళ్తుంది. అయితే అటుగా వచ్చిన ఆడి కారు ట్రక్కును ఢీ కొని పల్టీలు కొట్టింది. అయితే అదే సమయంలో ఒకతను ఆ మార్గంలో వెళ్తున్నాడు. వెనకాల కారు పల్టీలు కొట్టడంతో గుండె ఆగినంత పనయిపోయింది. షాపింగ్ చేసిన కవర్ కూడా వదిలి.. దేవుడా అంటూ పరుగెత్తాడు.

pedestrian is missed by inches as out-of-control Audi crashes..

రోడ్డుపై నడుస్తోన్న పాదచారుడు గుండెలు బిగపట్టుకొని మరీ పరుగుతీశాడు. ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఏకీపారేశారు. ఆడి కారు డ్రైవర్‌పై తిట్ల వర్షం కురిపించారు. మతిలేకుండా కారు నడిపారా అని మండిపడ్డారు.

Recommended Video

Fridays For Future : Greta Thunberg || ప్రపంచాన్నిషేక్ చేస్తోన్న పర్యావరణ ఉద్యమం || Oneindia Telugu

కారు డ్రైవర్ ఇడియట్ అని కింబర్లీ ఈవ్ సావేజ్ పోస్ట్ చేశారు. కారులో ఉన్నది మనిషి కాదు అని పీటర్ పోస్ట్ చేశారు. మతిస్థిమితం లేకపోవడంతోనే కారు డ్రైవర్ ఇలా ప్రవర్తించాడని ముర్తాజా నబీ రాశారు. కానీ చాలా మంది మాత్రం పాదచారుడు ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవడంపై ప్రస్తావించారు. ఆ దేవుడి దయవల్ల తప్పించుకున్నాడని పేర్కొన్నారు.

English summary
pedestrian hears the commotion and looks behind him only to see the vehicle heading straight at him in britan West Yorkshire
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X