• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాయ్‌ఫ్రెండ్‌ నిద్రపోతుంటే.. నిప్పంటించి, రెండు బకెట్ల మూత్రాన్ని ఇలా!

|

పెన్సిల్వేనియా: నిద్రపోతున్న తన బాయ్‌ఫ్రెండ్‌కు నిప్పంటించిన ఓ గర్ల్ ఫ్రెండ్.. ఆపై మంటలు చల్లార్చేందుకు రెండు బకెట్ల మూత్రాన్ని అతనిపై కుమ్మరించింది. పెన్సిల్వేనియాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను నివ్వెరపోయేలా చేసింది.

38ఏళ్ల లీఫ్ అన్ సెపేల్యక్ అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. బాయ్ ఫ్రెండ్ తో తలెత్తిన విభేదాల కారణంగానే అతనిపై ఇలా పగ తీర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదో విషయమై రోజంతా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. తీరా రాత్రి నిద్రకు ఉపక్రమించిన సమయంలో బాయ్ ఫ్రెండ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిందని తెలిపారు.

Penn Hills woman lights boyfriend on fire, douses him with urine

ఆపై మంటలకు తాళలేక రక్షించాలని అతను కేకలు పెట్టడంతో రెండు బకెట్ల మూత్రాన్ని కుమ్మరించి మంటలను ఆర్పిందని పేర్కొన్నారు. అప్పటికే ఏదో జరుగుతోందని పసిగట్టిన లీఫ్ అన్ తల్లిదండ్రులు.. పై అంతస్తు నుంచి కిందకు వచ్చి.. జరిగింది చూసి షాక్ తిన్నారు. తమ కుమార్తె ఎందుకలా చేసిందో వారికే అంతుపట్టలేదు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాపాయం ఏమి లేదని ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు.

కేవలం 25-30శాతం గాయాలతో అతను ప్రాణపాయం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. కాగా, తమ ఇంటి కింది అంతస్తులో టాయిలెట్ లేదని, అందువల్లే రెండు రోజులుగా బకెట్లలోనే మూత్ర విసర్జన చేస్తున్నామని, మంటల్లో కాలుతున్న భర్తపై దాన్నే కుమ్మరించాల్సి వచ్చిందని లీఫ్ అన్ చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి జులై 17వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. విచారణ అనంతరం లీఫ్ అన్‌కు శిక్ష పడే అవకాశముంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Penn Hills woman set her sleeping boyfriend on fire then doused him with buckets of urine to put out the flames, police said.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more