వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అరుదైన గౌరవం: పెంటగాన్‌లో ప్రత్యేక సెల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ దేశానికి దక్కని అరుదైనా గౌరవాన్ని భారత్‌కు అమెరికా కల్పించింది. ఇంతకీ ఏంటా ఆ ఆరుదైన గౌరవం అని అనుకుంటున్నారా? అమెరికా రక్షణ శాఖ కార్యాలయమైన పెంటగాన్‌లో భారత్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పెంటగాన్ ఒక దేశం కోసం ప్రత్యేకంగా ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

భారత దేశంతో తన రక్షణ సంబంధాలను మరింత వేగవంతం చేయడానికి, అలాగే ఆ దేశంలో హైటెక్ మిలిటరీ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సంయుక్తంగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

అమెరికా రక్షణ మంత్రిగా ఆష్టన్ కార్టర్ పెంటగాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్ కోసం ప్రత్యేకంగా ఇండియా రాపిడ్ రియాక్షన్ సెల్ (ఆర్‌ఆర్‌సి) అనే సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విభాగంలో అమెరికా రక్షణ శాఖలో వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు పని చేస్తున్నారు.

Pentagon cell to push India trade ties

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు అమలయ్యే విధంగా ఈ సెల్ పనిచేస్తోంది. భారత్-అమెరికా రక్షణ వాణిజ్యం, టెక్నాలజీ ఒప్పదం కింద తాము ప్రస్తుతం తాము చేపట్టిన అన్ని కార్యక్రమాలను వేగవంతం చేయడం ఈ ర్యాపిడ్ రియాక్షన్ సెల్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు.

ఏ పనినైనా సరే మూడు నెలల్లో పూర్తయ్యేలా ఈ ర్యాపిడ్ యాక్షన్ సెల్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన రక్షణ వాణిజ్య, టెక్నాలజీ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో ఇండియా ర్యాపిడ్ రియాక్షన్ సెల్‌ది కీలకపాత్ర అని, రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి తయారీకోసం భారత్‌కు తాము మరికొన్ని కొత్త ప్రతిపాదనలు కూడా పంపిస్తున్నామని అయన చెప్పారు.

దీని ద్వారా భారత్-అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరాయి. గతంలో కూడా ఇలాంటి చర్చలు, ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటివి జరిగేవి. అయితే దానికి ఏడాదిన్నరనుంచి మూడేళ్ల సమయం పట్టేది. అయితే ఇప్పుడు కేవలం మూడు నెలల్లోనే ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని వెబ్‌స్టర్ చెప్పారు.

ఇన్నాళ్లు పాకిస్థాన్‌కు ఉండగా ఉన్న అమెరికా ఇటీవల కాలంలో భారత్‌కు బాగా దగ్గరవుతుంది. ముఖ్యంగా భారత్‌ను వాణిజ్య పరంగా అమెరికా అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ నెలాఖరులో న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒబామా, మోడీ మధ్య జరగబోయే చర్చల్లో రక్షణ, వ్యూహాత్మక సహకారం కీలక అంశంగా మారనుంది.

English summary
In a clear signal of India’s importance, both as a major buyer and potential collaborator in the defence sector, the Pentagon has established its first-ever country special cell to speed up defence ties between India and the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X